విజయనగరం జిల్లా కందిరివలస గ్రామంలో వార్డు వాలంటీర్‌పై స్థానికులు దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన కోన లక్ష్మణరావు వాలంటీర్‌గా పని చేసేవాడు. విధుల్లో భాగంగా.. గ్రామంలోని ప్రజలకు కరోనా వైరస్ నేపథ్యంలో బయటికి రాకుండా ఉండలాని గ్రామస్థులకు చెప్పేవాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన చిన్నారావు, అతని తండ్రి సన్యాసి.. ఇద్దరూ లక్ష్మణరావుతో గొడవపడ్డారు.
వాలంటీర్‌పై దాడి... నిందితులకు రిమాండ్ - vizianagaram latest crime news
విజయనగరం జిల్లా కందిరివలస గ్రామంలో వార్డు వాలంటీర్‌గా పనిచేస్తున్న లక్ష్మణరావుపై అదే ఊరికి చెందినవారు దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన లక్ష్మణరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
అసలు కారణం....
ఈ వాలంటీర్ ఉద్యోగానికి లక్ష్మణరావు, చిన్నారావు పోటీపడగా... ఉద్యోగం కోన లక్ష్మణరావుకు దక్కింది. అది మనసులో పెట్టుకుని గత 20న లక్ష్మణరావు జిగిరామ్ గ్రామం నుంచి కందిరివలసలో శానిటేషన్ పనిమీద వెళ్లి వస్తుండగా దారి కాసి గాదిపల్లి చిన్నరావు కర్రతో లక్ష్మణరావుని కొట్టాడు. అనంతరం చేతితో గట్టిగా కొట్టాడు. తర్వాత కొంత దూరంలో చిన్నారావు తండ్రి సన్యాసి, చిన్నారావు తమ్ముడు రామకృష్ణ ముగ్గురూ కలిసి ముగ్గురు లక్ష్మణరావుని కొట్టారు. ఈ విషయాన్ని బయట పెట్టకుండా సాలూరులోని ఓ ఆస్పత్రిలో ఆశావర్కర్ ద్వారా నొప్పులకి మందులు తీసుకున్నాడు. అనంతరం 26న పాచిపెంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సాలూరు ప్రభుత్వాసుపత్రిలో లక్ష్మణరావుకి చికిత్స చేయించి విజయనగరం మహారాజా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి విశాఖపట్నం కేజీహెచ్‌కి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ నేపథ్యంలో నిందితులు వీఆర్వోని కలిసి జరిగిన విషయాన్ని చెప్పి పోలీసులకు లొంగిపోయారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపిస్తున్నట్లు సాలురు సీఐ సింహాద్రి నాయుడు వెల్లడించారు.