విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం అడ్డాపుశిల పంచాయతీ బంటువాని వలసలో ఇద్దరు యువకులపై కొందరు దాడిచేశారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైకాపా మద్దతుదారుడి విజయానికి సహకరించారనే కోపంతో.. ద్విచక్రవాహనంపై వెళ్తున్న వారిని ప్రత్యర్థి వర్గం కొట్టింది. క్షతగాత్రులను ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులను ఎమ్మెల్యే అలజంగి జోగారావు పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. దాడి చేసినవారిని తక్షణం అదుపులోకి తీసుకోవాలని పోలీసులను కోరారు.
ఎన్నికల్లో ప్రత్యర్థి గెలుపునకు సహకరించారంటూ ఇద్దరిపై దాడి - two persons injured in opposite group attack in addapusila
పంచాయతీ ఎన్నికల్లో వైకాపా మద్దతుదారుడి గెలుపునకు సహకరించారనే కోపంతో.. ప్రత్యర్థి వర్గం దాడి చేసిందంటూ.. ఇద్దరు యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం అడ్డాపుశిలలో ఈ ఘటన జరిగింది.
అడ్డాపుశిలలో ఇద్దరు యువకులపై ప్రత్యర్థి వర్గం దాడి