ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Jogimpeta Residential College: జోగింపేట గురుకులంలో రణరంగం.. విద్యార్థులు, ప్రిన్సిపల్​పై దాడి - విజయనగరం జిల్లా జోగింపేట గురుకుల విద్యాలయం

Attacks in Jogimpeta Residential College in: విద్యార్థుల మధ్య ఏర్పడిన చిన్నపాటి గొడవ.. తల్లిదండ్రుల వరకు వెళ్లింది. దీంతో ఇరువవర్గాల విద్యార్థుల తల్లిందండ్రులు.. ప్రిన్సిపాల్​పై ఘర్షణకు దిగారు. కార్యాలయ గదిలోకి ప్రవేశించి టేబుల్స్​, అద్దాలు సైతం ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా విద్యాలయ ప్రాంగణంలో తలపడ్డారు. ఇటు విద్యార్ధులు.. అటు తల్లిదండ్రుల వాగ్వాదాలు, ఈలలు, కేకలతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. ఈ ఘటన విజయనగరం జిల్లా జోగింపేట గురుకుల విద్యాలయంలో జరిగింది.

Attack on students and principal
Attack on students and principal

By

Published : Jan 8, 2022, 10:05 PM IST

Jogimpeta Gurukul Vidyalaya News: విజయనగరం జిల్లా సీతానగరం మండలం జోగింపేట గురుకుల విద్యాలయంలో రణరంగం చోటు చేసుకుంది. ఇంటర్​ విద్యార్థుల మధ్య జరిగిన గొడవ.. వారి తల్లిదండ్రులు.. విద్యార్థులు, ప్రిన్సిపల్​పై దాడికి దారి తీసింది. అంతటితో ఆగకుండా ఇరువర్గీయులు.. విద్యాలయ ప్రాంగణంలో తలపడ్డారు. గురుకుల పాఠశాలలో ఇంటర్​ మొదటి ఏడాది చదవుతున్న ముగ్గురు విద్యార్థుల ప్రవర్తన బాగోలేదని.. సీనియర్ ఇంటర్ విద్యార్థులు శుక్రవారం మందలించారు. ఈ విషయంపై జూనియర్ ఇంటర్ విద్యార్ధులు వారి కుటుంబసభ్యులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు ఇవాళ విద్యాలయానికి వచ్చి ప్రిన్సిపల్ వద్దకు సీనియర్ విద్యార్థులను పిలిపించారు. అనంతరం తల్లిదండ్రులు ఒక్కసారిగా విద్యార్థులు, ప్రిన్సిపల్​పై దాడి చేశారు. కార్యాలయ గదిలోకి ప్రవేశించి టేబుల్స్​, అద్దాలను సైతం ధ్వంసం చేశారు.

పరస్పరం దాడులు

ఈ విషయాన్ని తెలుసుకున్న సీనియర్ విద్యార్ధుల తల్లిదండ్రులూ.. కళాశాలకు వచ్చి ప్రిన్సిపాల్ వరప్రసాద్​తో గొడవకు దిగారు. మా పిల్లలను దూషించి, దాడి చేసిన వారిని పిలిపించాలని డిమాండ్ చేశారు. అనంతరం జూనియర్ ఇంటర్​కు చెందిన ముగ్గురు విద్యార్ధులపై దాడికి పాల్పడ్డారు.

పోలీసుల రాకతో...

ఇలా.. ఒకరి తర్వాత ఒకరు.. వాగ్వాదం, ఘర్షణకు దిగడంతో ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని మిగిలిన విద్యార్ధులు, అధ్యాపకులు ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న సీతానగరం ఎస్సై నీలకంఠం.. తమ బృందంతో ఘటన స్థలానికి చేరుకున్నారు. విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని విద్యార్థులు, వారి తల్లిదండ్రులను సముదాయించారు. దీంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. ప్రిన్సిపల్​ ఇచ్చిన సమాచారం మేరకు విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి..

VIRASAM Maha Sabhalu: నెల్లూరులో విరసం మహాసభలు.. పెద్దసంఖ్యలో పోలీసుల నిఘా!

ABOUT THE AUTHOR

...view details