స్టేషన్లోనే కానిస్టేబుల్‌పై దాడి కొంతమంది దాడి చేసిన ఘటన విజయనగరం జిల్లా పార్వతీపురంలో జరిగింది. ఎస్ఈబీ సహాయ సూపరింటెండెంట్ శ్రీనాథుడు తెలిపిన వివరాల మేరకు.. పంచాయతీ ఎన్నికల సందర్భంగా మద్యం, నాటుసారా అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. కొత్తగా విధుల్లో చేరిన ఇద్దరు కానిస్టేబుళ్లు పట్టణంలో నిఘా వేశారు. సుమారు 45 మద్యం సీసాలను ఆటోలో అక్రమంగా తరలిస్తున్న వ్యక్తుల్ని గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు.
పోలీస్ స్టేషన్లో దుండగుల వీరంగం... కానిస్టేబుల్‌పై దాడి - పార్వతిపురం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌పై దాడి వార్తలు
విజయనగరం జిల్లా పార్వతీపురం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న.. కానిస్టేబుల్‌పై కొంతమంది దాడి చేశారు. గాయపడిన కానిస్టేబుల్ని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పార్వతిపురం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌పై దాడి
వివరాలు సేకరిస్తున్న సమయంలో రెల్లివీధికి చెందిన కొంత మంది స్టేషన్‌కు వచ్చి కానిస్టేబుల్ రమేష్‌పై దాడిచేసి గాయపరిచారు. అతడిని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని.. కేసు నమోదు చేస్తామని ఏఈఎస్ తెలిపారు.
ఇదీ చదవండి: ఎన్నికల్లో సిరా చుక్క.. చరిత్రేంటో తెలుసుకోండి