ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వంద రోజుల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వమే - యువగళం సభ ద్వారా ఏపీకి దశ, దిశ ఇవ్వబోతున్నాం'

Atchannaidu on Yuvagalam Vijayotsava Sabha Arrangements: టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం విజయోత్సవ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద జరుగుతున్న సభ ఏర్పాట్లను పార్టీ ముఖ్యనేతలతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ వ్యవహార శైలిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Yuvagalam Vijayotsava Sabha
Yuvagalam Vijayotsava Sabha

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 19, 2023, 5:27 PM IST

Updated : Dec 19, 2023, 9:15 PM IST

'వంద రోజుల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వమే - యువగళం సభ ద్వారా ఏపీకి దశ, దిశ ఇవ్వబోతున్నాం'

Atchannaidu on Yuvagalam Vijayotsava Sabha Arrangements: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 'యువగళం' విజయోత్సవ సభ ఏర్పాట్లను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పరిశీలించారు. భోగాపురం మండలం పోలిపల్లి వద్ద జరుగుతున్న సభ ఏర్పాట్లను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులైన యనమల రామకృష్ణుడు, మాజీమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప, మాజీ ఎంపీ మాగంటి బాబు, ఇతర టీడీపీ శ్రేణులతో కలిసి ఆయన పరిశీలించారు. రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 6 లక్షల మంది కార్యకర్తలు, అభిమానులు విచ్చేస్తుండడంతో భారీ ఎత్తున ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు.

Atchannaidu Comments: అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ వ్యవహార శైలిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ''ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డా. బీఆర్. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పూర్తిగా మంట కలిసింది. ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో లేదు. స్వాత్రంత్వం వచ్చి, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలకు స్వేచ్ఛగా కార్యక్రమాలు చేసుకునే విధానం ఉండేది. కానీ, ఫస్ట్ టైం ఒక దుర్మార్గుడు (వైఎస్ జగన్) ముఖ్యమంత్రి అయిన తర్వాత అతని వైసీపీ పార్టీ తప్ప, మరే రాజకీయ పార్టీలు ఉండకూడదని గత 4 సంవత్సరాల 7 నెలలుగా పరిపాలన కొనసాగిస్తూ వస్తున్నాడు. టీడీపీ గత 40ఏళ్ల చరిత్రలో ఇలాంటి పరిస్థితులను ఎప్పుడు చూడలేదు. యువతకు ఆచరణ కాని హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన జగన్ వారిని దారుణంగా మోసం చేశారు'' అని ఆయన ధ్వజమెత్తారు.

దిగ్విజయంగా ముగిసిన నారా లోకేశ్ యువగళం పాదయాత్ర - భారీగా తరలివచ్చిన తెదేపా, జనసేన శ్రేణులు

Atchannaidu on Yuvagalam Padayatra: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నమ్మి, ఆశతో ఎదురుచూసిన యువతకు ఒక వేదిక ఉండాలనే ఆలోచనతో యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రను ప్రారంభించారని అచ్చెన్నాయుడు తెలిపారు. పాదయాత్ర ముందుకు సాగకుండా పోలీసులు, వైసీపీ నాయకులు రకరకాలుగా ఇబ్బందులు పెట్టారని ఆయన గుర్తు చేశారు. ప్రధానంగా కూర్చోవడానికి కుర్చీ, మాట్లాడటానికి మైక్ లేకుండా చేశారని అచ్చెన్నాయుడు ఆగ్రహించారు. వైసీపీ నేతలు ఎన్ని పిచ్చి పనులు చేసినా యువగళం పాదయాత్ర రోజు రోజుకు ఉప్పొంగే సముద్ర కెరటంలా ముందుకు సాగిందని ఆయన గుర్తు చేశారు. ఒక్క యువతకే కాకుండా అన్ని వర్గాల వారు వారి వారి కష్టాలను చెప్పుకున్నారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

మొదట యువగళం పాదయాత్రను శ్రీకాకుళంలో ముగించాలని అనుకున్నాం. కానీ, రోజురోజుకీ ఆదరణ రావడంతో అడ్డుకునే కుట్రలు పెరిగాయి. రూపాయి కూడా అవినీతి జరగని కేసులో మా నాయకుడు చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి, 53 రోజులు బంధించారు. పార్టీ నాయకుడిగా వారిని బయటకు తీసుకురావడం కోసం 80 రోజుల పాటు పాదయాత్ర ఆలస్యం అయ్యింది. కానీ, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విశాఖ వరకు మాత్రమే పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించాం. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు కూడా కవర్ అయ్యేలా రేపు విజయోత్సవ సభ భారీ ఎత్తున జరుపుతున్నాం. ఈ సభ ద్వారానే 2024 ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని నిర్ణయం తీసుకున్నాం.- అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్రాధ్యక్షులు

'లోకేశ్​ను ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని తెలుసు - రాష్ట్ర భవిష్యత్​ కోసం ఆయనకు రక్షణగా నిలబడ్డాం'

Yanamala Ramakrishnudu Comments: యువగళం సభ ఏర్పాట్లపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, మాజీమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎంపీ మాగంటి బాబులు మీడియాతో మాట్లాడారు. యువగళం విజయోత్సవ సభ చరిత్రలోనే నెంబర్ వన్ సభగా గుర్తింపు పొందబోతుందని యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ సభ ద్వారానే టీడీపీ, జనసేన తరఫున ఉమ్మడి మ్యానిఫెస్టోను ప్రకటించనున్నామని తెలిపారు. యువతకు చేయూత నివాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న ఆయన, ఈ సభ యువతకు సంబంధించిన సభ అని పేర్కొన్నారు. టీడీపీ, జనసేన కూటమి లక్ష్యం ప్రజాస్వామ్యాన్ని కాపాడటమేనని యనమల రామకృష్ణుడు వివరించారు.

Nimmakayala Chinarajappa Comments: యువగళం విజయోత్సవ సభ ఏర్పాట్లు, నిర్వహణకు సంబంధించి 16 కమిటీలు వేశామని మాజీ ఎంపీ నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. సభ వేదికను 200 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పు, 50 అడుగుల ఎత్తులో ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశామన్నారు. సభకు హాజరయ్యే వారి కోసం 24 గ్యాలరీలలో 50 వేల కుర్చీలు వేశామన్నారు. 6 లక్షల మంది వచ్చేలా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా జన సునామీని ఆపలేరని ఆయన వ్యాఖ్యానించారు. అధికార అహంతో విర్రవీగే ప్రభుత్వ కుట్రలను ఛేదిస్తామన్నారు.

మేము ఏనాడు వైసీపీ సభలకు ఇబ్బందులు, ఆంక్షలు పెట్టలేదు. కానీ, ఈరోజు అడుగడుగునా అడ్డుపడుతున్నారు. విశాఖలోని ఏయూ గ్రౌండ్‌లో యువగళం సభను నిర్వహించాలని నిర్ణయించాం. కానీ, ముఖ్యమంత్రి జగన్ అడ్డుకున్నారు. ఇది ఒక రాష్ట్ర కార్యక్రమం. రాష్ట్ర నలుమూలల నుంచి ఈ సభకు రావాలని కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. అందుకు ఆర్టీసీ బస్సులు కావాలని లేఖ రాసి, ఎండీకి కూడా చెప్పాం. మూడు రోజుల తర్వాత పైనుండి మాకు ఆదేశాలు రాలేదు, బస్సులు ఇవ్వడం కుదరదని చెప్పారు. పార్టీ మీద అభిమానం ఉన్నవాళ్లు ఫ్రీగా బస్సులు, వాహనాలు, ఆటోలు ఇస్తామన్న ముందుకొస్తే, వారిపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. ఇది ఏపీలో వైఎస్ జగన్ పరిపాలన పరిస్థితి. రాయలసీమ నుంచి రైళ్లు బుక్‌ చేసుకుని వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న రైళ్లు అద్దెకు దొరికాయి. రాష్ట్రంలో ఉన్న బస్సులు మాత్రం దొరకడం లేదు. ఈ సభ ద్వారా ఏపీకి ఒక దశ దిశ ఇవ్వబోతున్నాం. వంద రోజుల్లో టీడీపీ, జనసేన అధికారంలోకి వస్తుంది. - టీడీపీ నేతలు

కోలాహలంగా యువగళం పాదయాత్ర - లోకేశ్‌ వెంట నడిచిన భువనేశ్వరి, కుటుంబ సభ్యులు

Last Updated : Dec 19, 2023, 9:15 PM IST

ABOUT THE AUTHOR

...view details