నిధులు, వ్యాపారాల కోసం మాన్సస్ ట్రస్ట్ స్థాపించలేదని కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు అన్నారు. తన తాతగారి పేరుపై స్థాపించిన సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత తనకుందని తెలిపారు. విద్యార్థుల అభివృద్ధి కోసం మాన్సాస్ ట్రస్ట్ ఏర్పాటు చేశారన్న ఆయన ట్రస్టు వ్యవహారాల్లో రాజకీయ జోక్యం తగదని మండిపడ్డారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా రాత్రికి రాత్రే జీవోలు జారీ చేశారని, దీనిపై న్యాయ పోరాటం చేస్తానని ఆయన అన్నారు.
'మాన్సస్ ట్రస్ట్ వ్యవహారంలో ప్రభుత్వ తీరు సరికాదు' - మాన్సస్ ట్రస్టుపై అశోక్‌గజపతిరాజు వ్యాఖ్యలు
మాన్సస్ ట్రస్ట్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు సరికాదని కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు అన్నారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా రాత్రికి రాత్రే జీవోలు జారీ చేయడం ఎంత వరకు సమంజసమని ఆయన అన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టంచేశారు.
!['మాన్సస్ ట్రస్ట్ వ్యవహారంలో ప్రభుత్వ తీరు సరికాదు' ashokgajapati raju talks about mansus trust](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6325350-304-6325350-1583561761737.jpg)
అశోక్‌గజపతిరాజు
Last Updated : Mar 7, 2020, 8:13 PM IST