ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా అధికారంలోకి వస్తే అన్న క్యాంటీన్లు మళ్లీ తెరుస్తాం: అశోక్‌గజపతి

తెదేపా అధికారంలోకి వస్తే అన్న క్యాంటీన్లు మళ్లీ తెరుస్తామని తెదేపా సీనియర్ నేత అశోక్‌ గజపతి రాజు అన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో అన్న క్యాంటీన్‌ సంచార వాహనాన్ని ప్రారంభించిన ఆయన.. గత ప్రభుత్వ పథకాలను జగన్ సర్కారు నిలిపివేయటం దారుణమన్నారు.

తెదేపా అధికారంలోకి వస్తే అన్న క్యాంటీన్లు మళ్లీ తెరుస్తాం
తెదేపా అధికారంలోకి వస్తే అన్న క్యాంటీన్లు మళ్లీ తెరుస్తాం

By

Published : Jun 23, 2022, 3:14 PM IST

తెదేపా అధికారంలోకి వస్తే అన్న క్యాంటీన్లు మళ్లీ తెరుస్తాం

Ashok Gajapathi Raju: రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండూ పోయాయని తెదేపా సీనియర్‌ నేత అశోక్ గజపతి రాజు వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ పథకాలను నిలిపివేయడం దారుణమన్నారు. తెదేపా అధికారంలోకి వస్తే అన్న క్యాంటీన్లను తిరిగి తెరుస్తామన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గ తెదేపా ఇంచార్జి బేబీ నాయన జన్మదినాన్ని పురస్కరించుకుని రేపటి నుంచి బొబ్బిలిలో అన్న క్యాంటీన్ నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమం నిర్వహణ కోసం ప్రత్యేక రూపొందించిన మొబైల్ వాహనాన్ని జిల్లా తెదేపా కార్యాలయంలో అశోక్ గజపతిరాజు, బేబీ నాయన ప్రారంభించారు. బొబ్బిలి నియోజకవర్గంలో అన్న క్యాంటీన్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు ముందుకొచ్చిన బేబీ నాయన, వారి సహచర బృందాన్ని ఆయన అభినందించారు. ఇది ఒక్క బొబ్బిలికే పరిమితం కాకుండా అన్ని నియోజకవర్గాల్లోనూ అమలు చేస్తే బాగుటుందని అశోక్ అభిప్రాయపడ్డారు.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details