విజయనగరం జిల్లాలో భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని కుదించటంపై తెదేపా సీనియర్ నేత అశోక్ గజపతి రాజు మండిపడ్డారు. భోగాపురం విమానాశ్రయాన్ని నిర్వీర్యం చేసేందుకు వైకాపా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సర్కార్ నిర్ణయం వల్ల ఉత్తరాంధ్ర ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి స్థలాన్ని ఎందుకు తగ్గించారో ప్రజలకు ప్రభుత్వం చెప్పాలి. భోగాపురం విమానాశ్రయ నిర్మాణంలో తాజా సవరణలతో అనేక ఉద్యోగాలు పోతాయి. ఉద్యోగ అవకాశాలు, అభివృద్ధి పెరగాలంటే గతంలో డిజైన్ చేసిన ప్రాజెక్టును కొనసాగించాలి -అశోక్ గజపతిరాజు