రాష్ట్రంలో కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని కేంద్ర మాజీ మంత్రి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు సూచించారు. ఇప్పటికే దేశంలో కరోనాతో ఆర్థికంగా నష్టాలు చవిచూస్తున్నారని గుర్తు చేశారు. 6 నెలల ముందే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించి ఉంటే.. కేంద్రం నుంచి వచ్చే నిధులకు ఇబ్బంది ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. కేంద్రానికి పన్ను కడుతున్న మనకే.. నిధులకు ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన చెందారు.
'అప్పుడే ఎన్నికలు నిర్వహించి ఉంటే కేంద్రం నిధులు వచ్చేవి'
రాష్ట్రంలో అయోమయ పరిస్థితి ఉందని.. వైకాపా అధికారంలోకి వచ్చి 9 నెలలు అయినా స్థానిక ఎన్నికలు నిర్వహించలేకపోయిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు అన్నారు. ఇప్పటికే ఎన్నికలు జరిగి ఉంటే కరోనా బాధ తప్పేదని అభిప్రాయపడ్డారు.
'అప్పుడే ఎన్నికలు నిర్వహించి ఉంటే.. కేంద్రం నిధులు వచ్చేవి'