ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి ప్రతిష్టను మరింత పెంచేందుకు కలిసి పనిచేద్దామని పాలక మండలి సభ్యులకు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, ఛైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు పిలుపునిచ్చారు. విజయనగరంలోని పైడితల్లి దేవస్థానం కల్యాణ మండపంలో నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ASHOK GAJAPATI RAJU : 'పైడితల్లి అమ్మవారి ప్రతిష్టను పెంచేందుకు కలిసి పనిచేద్దాం' - Ashok Gajapathiraju
పైడితల్లి అమ్మవారి ప్రతిష్టను మరింత పెంపొందించేందుకు కలిసి పని చేయాలని ఆలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజు అన్నారు. నూతన పాలకమండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ASHOK GAJAPATI RAJU
రామతీర్థం దేవస్థానం కార్యనిర్వహణాధికారి ప్రసాదరావు నూతన సభ్యులచే ప్రమాణం చేయించారు. భక్తి పూర్వకంగా తల్లికి సేవ చేస్తేనే భక్తుల మన్ననలు పొందగలుగుతామని ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు పాలక మండలి సభ్యులకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు ఆలయ ఆనవాయితీలను పాటించాలని సూచించారు. నియమ, నిబంధనలను ఎవరూ అతిక్రమించవద్దని కోరారు.
ఇదీచదవండి.