ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహారాజ కళాశాలను ప్రైవేటీకరించాల్సిన అవసరం ఏముంది?: అశోక్‌గజపతిరాజు - మాాన్సాస్ ట్రస్ట్ ఆస్తులపై అశోక్ గజపతి రాజు కామెంట్స్

రాజకీయాలకు అతీతంగా మాన్సాస్ ట్రస్ట్ కార్యకలాపాలు ఉండాలని మాన్సాస్‌ ట్రస్టు మాజీ ఛైర్మన్ అశోక్ గజపతిరాజు అన్నారు. సంస్థ నిర్వహణ పరంగా కీలక నిర్ణయం తీసుకుంటే వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

మాన్సాస్ ట్రస్టు కుటుంబ, ప్రైవేట్ ఆస్తి కాదు: అశోక్‌గజపతిరాజు
మాన్సాస్ ట్రస్టు కుటుంబ, ప్రైవేట్ ఆస్తి కాదు: అశోక్‌గజపతిరాజు

By

Published : Oct 1, 2020, 6:01 PM IST

మహారాజ కళాశాల ప్రైవేటీకరించాల్సిన అవసరం ఏముంది?: అశోక్‌గజపతిరాజు

ఎంతో చరిత్ర కలిగిన మహారాజ కళాశాలను ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నారో అర్థంకావడం లేదని మాన్సాస్‌ ట్రస్టు మాజీ ఛైర్మన్ అశోక్‌గజపతిరాజు అన్నారు. 120 కోట్ల రూపాయల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, భూములు కలిగిన మాన్సాస్ ట్రస్టు....జీతాలు ఇవ్వలేకపోతున్నామని చెప్పడం దారుణమన్నారు.

ట్రస్టు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం తగదని చెప్పారు. ఇది కుటుంబ ఆస్తి కాదని... ప్రైవేట్ ఆస్తి అంతకన్నా కాదని అశోక్‌గజపతిరాజు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చట్టాలు, రాజ్యాంగంపై గౌరవం లేదని ఆగ్రహించారు.

ABOUT THE AUTHOR

...view details