ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆటోల్లో చోరీలకు పాల్పడుతున్న మఠా అరెస్ట్ - విజయనగరం తాజా వార్తలు

ఆటోల్లో ప్రయాణిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని.. మాయమాటలు చెప్పి చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను విజయనగరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళ నుంచి భారీ మొత్తంలో బంగారం కాజేసిన ఘటనకు సంబంధించి.. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేశారు. నిందితులను అరెస్టు చేశారు.

arrest of a gang of thieves in vizianagaram
ఆటోలలో చోరీలకు పాల్పడుతున్న దొంగల మఠా అరెస్ట్

By

Published : Feb 9, 2021, 6:27 PM IST

ఆటోలో ప్రయాణించే వారిని లక్ష్యంగా చేసుకుని చోరీకి పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తుల బృందాన్ని అరెస్ట్ చేసినట్లు విజయనగరం డీఎస్పీ అనిల్ కుమార్ వెల్లడించారు. వుటగడ్డ ప్రాంతానికి చెందిన దాడి సూర్యావతి అనే మహిళ విజయనగరానికి వచ్చి తిరిగి ఆటోలో వెళ్తుండగా ఆమెను మాటల్లో పెట్టి ఈ దొంగల ముఠా.. ఆమె వద్ద నుంచి 14 తులాల బంగారం, జత వెండి పట్టీలు, 9300 రూపాయల నగదు కాజేశారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సదరు మహిళ నుంచి కాజేసిన బంగారం, వెండి ఆభరణాలను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ అనిల్ కుమార్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details