విజయనగరం జిల్లాలో రైతులు ధర్నా నిర్వహించారు. పారదీప్ నుంచి హైదరాబాద్ వరకు ఐవోసీ నిర్మిస్తున్న గ్యాస్ పైప్లైన్ కోసం సేకరించిన సేద్యపు భూములకు తగిన పరిహారం చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. ఈ నిరసనలో జిల్లాలోని పది మండలాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తమ అనుమతి లేకుండా ఐవోసీ ఏకపక్షంగా పైప్ లైన్ నిర్మిస్తోందని వాపోయారు. 1962 పెట్రోలియం, మినరల్ చట్టం ప్రకారం తమకు భూమిపై అన్ని హక్కులు ఉన్నాయని తెలిపారు. కంపెనీ ప్రతినిధులు బెదిరింపులకు దిగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ 2013 భూసేకరణ చట్టం సవరణకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
''గ్యాస్ పైప్లైన్ కోసం సేకరించిన భూములకు పరిహారం చెల్లించాలి'' - విజయనగరం రైతులు తాజా వార్తలు
విజయనగరం జిల్లాలో గ్యాస్ పైప్లైన్ కోసం సేకరించిన భూములకు తగిన పరిహారం చెల్లించాలని... రైతులు ధర్నా నిర్వహించారు. జిల్లాలోని పది మండలాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున ఈ నిరసనకు హాజరయ్యారు.
ఆందోళన చేస్తున్న రైతులు