విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం ఇటిక గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయ ప్రతిష్ట మహోత్సవాలు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉదయం విఘ్నేశ్వర పూజ, పుణ్వవచనం, నవగ్రహ స్ధాపన, ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు. తర్వాత విగ్రహాలను పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం విగ్రహాలను ఆలయంలో ప్రతిష్ఠించి, అభిషేకాలు నిర్వహించారు. దేవాలయాన్ని సుందరంగా తయారు చేశారు. పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో చుట్టు పక్కల ప్రజలు, భక్తులు భారీగా హాజరయ్యారు.
విజయనగరంలో ఘనంగా కాశీ విశ్వేశ్వర ఆలయ ప్రతిష్ఠా మహోత్సవం - kaashi visheswara temple
విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలంలో నూతనంగా నిర్మించిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయ ప్రతిష్ట మహోత్సవాలు ఘనంగా జరిగాయి. విగ్రహాలను పురవీధుల్లో ఊరేగించిన అనంతరం ఆలయంలో ప్రతిష్ఠించి, అభిషేకాలు నిర్వహించారు.
kashi visheswara new temple vijayanagaram