అగ్రిగోల్డ్ బాధితులు కట్టిన ప్రతి రూపాయి తిరిగి ఇప్పిస్తా - janasena
''విజయనగరం సంస్థానాన్ని అందంగా తీర్చిదిద్దుతా. సహజవనరులను ఉపయోగించుకుని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్ది.. వలసలు ఆగిపోయేలా చేస్తా'': విజయనగరం ప్రచారంలో జనసేనాని పవన్
విజయనగరం ప్రచారంలో జనసేనాని పవన్ కల్యాణ్ హామీల వర్షం కురిపించారు. జిల్లాను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్ది వలసలు ఆగిపోయేలా చేస్తానని అన్నారు. జిల్లాలో ఉన్న 3 జూట్ మిల్లులు తెరిపించి యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. తోటపల్లి ప్రాజెక్టు ద్వారా ప్రతి ఎకరానికి నీరు ఇస్తామని తెలిపారు. వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఆ సంస్థ ఆస్తులు అమ్మైనా.. బాధితులు కట్టిన ప్రతి రూపాయి తిరిగి ఇచ్చేలా చేస్తామని వెల్లడించారు. జిల్లాకు పరిశ్రమలు తేవడంలో విఫలమైతే యువతకు భృతి కల్పించి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కల్పిస్తామని వివరించారు.