- తెలుగును రక్షించుకుందాం.. తెలివితేటలు పెంచుకుందాం: జస్టిస్ ఎ.వి. శేషసాయి
తెలుగును రక్షించుకుందాం.. తెలివితేటలు పెంచుకుందాం అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.వి. శేషసాయి.. ప్రపంచ తెలుగు రచయితల మహాసభల వేదికగా పిలుపునిచ్చారు. మాతృభాష పరిరక్షణలో తల్లులు, గురువులదే కీలక భూమిక అన్నారు. విజయవాడలో రెండు రోజులపాటు జరిగిన తెలుగు రచయితల ఐదో మహాసభల్లో.. తెలుగు భాష పరిరక్షణ కోసం 18 తీర్మానాలు చేశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వైకాపా నేతలకు విశాఖలోని ఆస్తులపైనే ప్రేమ: చంద్రబాబు
నా బాధ, ఆవేదన అంతా ప్రజల భవిష్యత్తు గురించేనని చంద్రబాబు విజయనగరంలో స్పష్టం చేశారు. వైకాపా నేతలకు విశాఖలోని ఆస్తులపైనే ప్రేమ.. విశాఖలోని రుషికొండను పూర్తిగా ధ్వంసం చేశారన్నారు. విశాఖలోని దసపల్లా భూములను కొట్టేశారన్నారు. జగన్ కొట్టేసిన భూముల విలువ రూ.40 వేల కోట్లు ఉంటుదని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బీఎఫ్ 7పై అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం.. విమానాశ్రయాలలో స్క్రీనింగ్ పరీక్షలు
చైనాతో పాటు ఇతర దేశాల్లోనూ పంజా విసురుతున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఉపరకం బీఎఫ్ 7 వైరస్‌పై ఏపీ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. తాజాగా శనివారం నుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం విదేశీ ప్రయాణికులకు స్క్రీనింగ్ పరీక్షలతో పాటు 2శాతం మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయాలని సూచించింది. గన్నవరం, విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయాలలో కొవిడ్ నిబంధనలను కేంద్రం ఇప్పటికే జారీ చేసిన మార్గదర్శకాలను పాటించడంలో భాగంగా ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సీఎం మారడం వల్లే రైతులు, పేదల తలరాతలు మారుతున్నాయి: సీఎం జగన్
గత ప్రభుత్వం మనకంటే ఎక్కువ అప్పులు చేసినా.. ఇప్పటిలా ఎందుకు సంక్షేమ పథకాలు అందించలేకపోయిందని.. సీఎం జగన్ ప్రశ్నించారు. తన సొంత నియోజక వర్గం పులివెందులలో.. ముఖ్యమంత్రి జగన్ పర్యటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పొరపాటున బ్యాంక్ ఖాతాల్లోకి రూ.2కోట్లు.. విలాసాలకు ఖర్చు చేసిన యువకులు.. ఆఖరికి..
పొరపాటున తమ అకౌంట్లో పడిన రూ.2.44 కోట్లను ఖర్చు చేశారు ఇద్దరు యువకులు. ఈ ఘటన కేరళలో జరిగింది. నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తిమింగలం వాంతితో దందా.. 25కేజీలు సీజ్ చేసిన పోలీసులు.. విలువ రూ.25కోట్లు!
తమిళనాడు తూత్తుకుడిలో రూ.25 కోట్లు విలువ చేసే అంబర్‌గ్రీస్‌ను(తిమింగలం వాంతి) అక్రమ రవాణా చేస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి రూ.25 కోట్ల విలువ చేసే అంబర్‌గ్రీస్‌ను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పుతిన్ సేనల అరాచకాలు.. అనాథ పిల్లల కిడ్నాప్.. రష్యాకు తీసుకెళ్లి...
వైమానిక దాడులతో ఉక్రెయిన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రష్యా... యుద్ధ నిబంధనలను ఉల్లంఘించమే కాకుండా అనేక దారుణాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పోర్టు సిటీ ఖేర్సన్‌లోని అనాథ పిల్లలను ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. వారికి శిక్షణ ఇచ్చి సైన్యంలో చేర్చుకోనున్నట్లు సమాచారం.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 2022 నేర్పిన ఆర్థిక పాఠాలేంటి?.. కొత్త ఏడాదిలో ఎలా ముందుకెళ్లాలి?
2022 ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి పరిణామాలు జరిగాయి? నూతన సంవత్సరంలో వీటిని ఎలా సరిచేసుకోవాలి? ద్రవ్యోల్బణం, ఉద్యోగ తొలగింపులు, క్రిప్టోకరెన్సీ పతనం, మాంద్యం భయాలు.. ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేశాయి. కాబట్టి వీటి నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుని కొత్త ఏడాదిలో ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- టెస్టుల్లో విరాట్ కోహ్లీ తడబాటు.. 50 కంటే దిగువకు సగటు..
టీ20 ప్రపంచకప్ తర్వాత విశ్రాంతి తీసుకొని మరీ బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చిన విరాట్ కోహ్లీ.. మరోసారి బ్యాటింగ్‌లో తడబాటుకు గురి కావడం కనిపిస్తోంది. బంగ్లాతో రెండు టెస్టుల్లోనూ విఫలమయ్యాడు. దీంతో అతడి సగటు 50 కంటే తక్కువకు పడిపోయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Avatar 2 OTT Release : ఓటీటీలోకి అవతార్ 2 అప్పుడే.. స్ట్రీమింగ్ తేది అదే..?
Avatar 2 OTT Release : సరికొత్త ప్రపంచంతో ప్రేక్షకులను అలరించింది అవతార్ 2. తాజాగా ఈ సినిమా ఓటీటీపై చర్చ జరుగుతోంది. కాగా, ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాంలో అవతార్ 2 విడుదల కాబోతుందని సమాచారం. విడుదల తేదీ కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.