ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 5 PM - ap top ten news

ఏపీ ప్రధాన వార్తలు

ap top news
ఏపీ ప్రధాన వార్తలు

By

Published : Nov 16, 2022, 5:00 PM IST

  • అశ్రునయనాల మధ్య అధికార లాంఛనాలతో సూపర్​స్టార్​ కృష్ణకు అంతిమవీడ్కోలు
    సినీ దిగ్గజం, సూపర్​స్టార్​ కృష్ణ అంత్యక్రియలు.. మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు వందలమంది అభిమానులు, చలనచిత్ర ప్రముఖులు తరలివచ్చారు. కృష్ణ భౌతికకాయానికి కన్నీటి నివాళి అర్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • తెలుగుదేశం అంటే అభివృద్ధికి మారు పేరు: చంద్రబాబు
    CHANDRABABU TOUR : తెలుగుదేశం అంటే అభివృద్ధికి మారుపేరని ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. జగన్​ మాట్లాడితే ఏదో జరిగిపోతుందని నమ్మి.. ప్రజలు మోసపోయారని తెలిపారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన కర్నూలు చేరుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వికేంద్రీకరణకు మద్దతుగా వైకాపా నాయకుల ర్యాలీ
    Three Capitals : రాష్ట్రంలో పలు చోట్ల వికేంద్రీకరణకు మద్దతుగా వైకాపా నాయకులు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఒక రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు అంటూ నినాదాలు చేశారు. కర్నూలులో.. రాజ్ విహర్ కూడలి వద్ద హైకోర్టు సాధన సమితి జేఏసీ ఆధ్వర్యంలో.. విద్యార్థులతో మానవహారం నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రాయచోటిలో మంత్రి జోగి రమేశ్​ పర్యటన.. బాధితులను అడ్డుకున్న పోలీసులు
    Minister Jogi Ramesh: అన్నమయ్య జిల్లాలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్​ పర్యటించారు. జగనన్న లే అవుట్​లను పరిశీలించారు. అయితే జిల్లాలో పర్యటనకు వచ్చిన మంత్రిని కలిసేందుకు వచ్చిన అన్నమయ్య ప్రాజెక్టు వరద బాధితులకు నిరాశే మిగిలింది. మంత్రిని కలవకుండా పోలీసులు అడ్డుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పులివెందులలో వీఆర్ఓపై రైతు కత్తితో దాడి.. ఏం జరిగింది..?
    Farmer attacked on VRO: గత కొంత కాలంగా ప్రభుత్వ అధికారులపై కత్తులతో దాడులు చేయడం,పెట్రోల్ పోయడం లాంటి వార్తలు చూస్తున్నాం.. అలాంటి ఘటన వైఎస్ఆర్ కడప జిల్లాలో చోటు చేసుకుంది. తన భూమి వివరాలను ఆన్​లైన్​లో నమోదు చేయలేదన్న ఆగ్రహంతో పెద్ద మస్తాన్ అనే రైతు వీఆర్ఓపై కత్తితో దాడి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఏనుగు దెబ్బకు అడవిలో 8 కిలోమీటర్లు రివర్స్ గేర్​లో బస్సు ప్రయాణం
    కేరళ త్రిస్సూర్​ జిల్లాలోని అటవీ మార్గంలో ఓ బస్సు డ్రైవర్​ 8 కిలోమీటర్లు మేర బస్సును రివర్స్​ గేర్​లో నడిపాడు. మంగళవారం చలకుడిలోని వాల్‌పరై అటవీ మార్గంలో ఓ ఏనుగు 40 మందితో ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్​ బస్సును వెంబడించింది. ఏనుగు బారి నుంచి ప్రయాణికులను కాపాడేందుకు డ్రైవర్​ బస్సును రివర్స్​ గేర్​లో నడిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మద్యం తాగొద్దని చెప్పినందుకు కూతురిని కాల్చి చంపిన తండ్రి
    ఉత్తర్​ప్రదేశ్​లో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ తండ్రి తన కూతురిని అతి కిరాతకంగా కాల్చి చంపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పోలండ్​పై క్షిపణి దాడి.. జీ7, నాటో అలర్ట్... నిజంగా రష్యా పనేనా?
    Russia Ukraine war: ఉక్రెయిన్-రష్యా యుద్ధం కొనసాగుతున్న వేళ పోలండ్​ సరిహద్దులోని ఓ గ్రామంలో క్షిపణి పడటం తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఇది రష్యా చేసిన లక్షిత దాడేనా అనే అంశం చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో నాటో, జీ7 దేశాలు అప్రమత్తమయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సూర్య.. సూర్యా భాయ్... ఇది పేరు కాదు ఇట్స్​ ఏ బ్రాండ్.. గణాంకాలు చూస్తే మతిపోవాల్సిందే!
    టీమ్​ఇండియా స్టార్ బ్యాటర్​ సూర్యకుమార్​ తన విధ్వంసకరమైన షాట్లతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ముఖ్యంగా ఫాస్ట్ పిచ్​లపైనా కూడా విధ్వంసం సృష్టిస్తున్నాడు. అయితే అతడికి ఈ ప్రతిఫలం ఏదో ఒక్క రోజుతో వచ్చింది కాదు. నిత్యం కొత్త విషయాలు నేర్చుకొంటూ.. బలహీనతలను జయిస్తూ భారత్‌ క్రికెట్‌లో వెలిగిపోతున్నాడు స్కై. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సన్నీ లియోనీకి హైకోర్టులో ఊరట.. 'కాంట్రాక్ట్​' కేసుపై స్టే
    Sunny Leone Kerala High Court : బాలీవుడ్​ నటి సన్నీ లియోనీకి సంబంధించిన ఒప్పంద ఉల్లంఘన కేసుపై స్టే విధించింది కేరళ హైకోర్టు. తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details