ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మీకేనా బాధలు మాకు లేవా.. యూజ్ లెస్ ఫెలో'.. వైఎస్సార్సీపీ నేతపై మంత్రి బొత్స ఆగ్రహం - AP Minister Botsa Satyanarayana fire news

AP Minister Botsa Satyanarayana fire on YCP leaders : మంత్రి బొత్స సత్యనారాయణకు కోపమొచ్చింది. ఈ సారి సొంత పార్టీ నాయకులపైన ఆయన మండిపడ్డారు. 'మాకు లేవా బాధలు.. మీకేనా.. యూజ్ లెస్ ఫెలో, నువ్వు పెద్ద పోటుగాడివా' అంటూ వ్యాఖ్యానించారు. మంత్రి వ్యాఖ్యలతో స్థానిక నేతలు అవాక్కయ్యారు.

AP Minister
AP Minister

By

Published : Apr 8, 2023, 9:36 PM IST

Updated : Apr 9, 2023, 9:06 AM IST

AP Minister Botsa Satyanarayana fire on YCP leaders: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ నాయకులపై తీవ్రంగా మండిపడ్డారు. 'మాకు లేవా బాధలు.. మీకేనా.. యూజ్ లెస్ ఫెలో, నువ్వు పెద్ద పోటుగాడివా' అంటూ కాన్వాయ్ దగ్గరకు వెళ్లిన నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ అన్న మాటలు విజయనగరం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారాయి.

AP Minister

మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజుపై.. ఎస్.కోట పట్టణ వైసీపీ అధ్యక్షుడు రహిమాన్ మంత్రికి ఫిర్యాదు చేయగా.. ఈ సంఘటన చోటు చేసుకుంది. "మాకు లేవా బాధలు.. మీకేనా.. యూజ్ లెస్ ఫెలో, నువ్వు పెద్ద పోటుగాడివా" అంటూ మంత్రి రెచ్చిపోయారు. శృంగవరపుకోటలో మహిళా సంఘాలకు మూడో విడత ఆసరా పథకం చెక్కుల పంపిణీ నిర్వహించారు. మండల పరిషత్తు ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి బొత్స సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఆసరా కార్యక్రమం ముగించుకుని మంత్రి వెళ్తుండగా కాన్వాయ్ దగ్గరకు వెళ్లిన నాయకులపై మండిపడ్డారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజుపై., పట్టణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు రెహమాన్.. మంత్రికి ఫిర్యాదు చేశాడు. పట్టణంలో గ్రూపులు కట్టి.. సొంత పార్టీ నాయకులనే ఓడించిన వారికి తిరిగి పదవులు కట్టబెడుతున్నారంటూ రహిమాన్ మంత్రి వద్ద వాపోయారు.

ఎమ్మెల్యే పై కూడా కొందరిని రెచ్చగొడుతున్నారంటూ చెప్పబోయాడు. దీంతో స్పందించిన మంత్రి బొత్స.. ఫిర్యాదు చేయడానికి ఇది సమయం కాదని చెప్పారు. కావాలంటే విజయనగరం రండి మాట్లాడుదాం అంటూ వారించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా రహమాన్ కు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా.. అప్పటికే తన ఆవేదన వ్యక్తం చేసిన రహమాన్ .. మా బాధలు పట్టించుకోండి అంటూ మంత్రికి అడ్డు చెప్పబోయాడు. దీంతో ఆగ్రహానికి గురైన మంత్రి... రెహమాన్​పై మండిపడ్డాడు. "మాకు లేవా బాధలు... మీకేనా... యూజ్ లెస్ ఫెలో, నువ్వు పెద్ద పోటుగాడివా" అంటూ మంత్రి రెచ్చిపోయారు. ఈ దృశ్యాన్ని చిత్రీకరించేందుకు స్థానిక ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కాన్వాయ్ దగ్గరకు వెళ్లి ప్రయత్నించగా... కెమెరా ఆపమని మంత్రి బొత్స హుకూం జారీ చేశారు.

ప్రభుత్వం మంజూరు చేసిన 7వేల కోట్ల రూపాయలు ఆసరా పింఛన్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయి. ఏదైనా మాటిస్తే నెరవేర్చడమే సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన. అందుకే ఈ సభ. ఆ విషయం చెప్పడానికే ఈ సభ పెట్టాం. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఎంతో మందికి లబ్ధి చేకూరుస్తోంది.- ఆసరా పథకం చెక్కుల పంపిణీ సభలో మంత్రి బొత్స

ఇవీ చదవండి

Last Updated : Apr 9, 2023, 9:06 AM IST

ABOUT THE AUTHOR

...view details