ఏపీలో విమానాశ్రయ అభివృద్ధి కార్పొరేషన్‌కు 230 కోట్ల రూపాయల మేర పరిపాలనా అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. భోగాపురం విమానాశ్రయ భూసేకరణ, పునరావాసం, మౌలిక సదుపాయల కల్పన కోసం నిధుల వినియోగానికి సోమవారం అనుమతి మంజూరు చేసింది. ఏపీఐఐసీ నుంచి తీసుకున్న 220 కోట్ల రూపాయల రుణాన్ని తిరిగి చెల్లించాలంటూ ఏపీ విమానాశ్రయ అభివృద్ధి కార్పొరేషన్‌కు ప్రభుత్వం సూచించింది. మిగిలిన 10 కోట్ల రూపాయల్ని భూసేకరణ కోసం వినియోగించాలని చెప్పింది.
భోగాపురం విమానాశ్రయ భూసేకరణకు రూ.10 కోట్లు
ఏపీ విమానాశ్రయ అభివృద్ధి కార్పొరేషన్‌కు 230 కోట్ల రూపాయల మేర పరిపాలన అనుమతులు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో 10 కోట్ల రూపాయలను భోగాపురం విమానాశ్రయ భూసేకరణకు వినియోగించాలని సూచించింది.
ap government