మహాకవి గురజాడ అప్పారావు జయంతిని అధికారిక ఉత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ తెలిపారు. ఈ మేరకు మహాకవి జయంతిని ఈ నెల 21న ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఉత్సవ నిర్వహణలో కచ్చితంగా కొవిడ్ నిబంధనలను పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఉత్సవంగా గురజాడ జయంతి - gurajada apparao birth anniversary latest news
గురజాడ అప్పారావు జయంతిని అధికారిక ఉత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ తెలిపారు. ఈ నెల 21న జయంతి నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
Gurajada Apparao