ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Bosta Review On Works Bills: ఉపాధిహామీ బిల్లులపై మంత్రి బొత్స సమీక్షా.. రికార్డ్‌ చేసి ఆన్‌లైన్‌లో బిల్లులు అప్‌లోడ్ చేయాలి - AP MINISTER BOSTA REVIEW news

AP MINISTER BOSTA REVIEW ON WORKS BILLS: ఉపాధి హామీ పనుల నమోదు, పెండింగ్ బిల్లులు, బిల్లుల‌ అప్‌లోడ్, గ‌డ‌ప‌ గ‌డ‌ప‌కు మ‌న ప్రభుత్వం వంటి అంశాలపై విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ ప్రజాప్రతినిధులు, అధికారుల‌తో సమీక్షించారు. అనంతరం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

AP MINISTER BOSTA
AP MINISTER BOSTA

By

Published : May 27, 2023, 7:45 PM IST

AP MINISTER BOSTA REVIEW ON WORKS BILLS: ఉపాధి హామీ క‌న్వర్జెన్స్ నిధులు, కలెక్టరేట్‌లో ఇంజినీరింగ్ ప‌నుల‌పై విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ ఈరోజు విజయనగరం జిల్లా క‌లెక్టర్ కార్యాల‌యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో భాగంగా పనుల నమోదు, పెండింగ్ బిల్లులు, బిల్లుల‌ అప్‌లోడ్, గ‌డ‌ప‌ గ‌డ‌ప‌కు మ‌న ప్రభుత్వం వంటి అంశాలపై ప్రజాప్రతినిధులు, అధికారుల‌తో ఆయన సుదీర్ఘంగా చర్చించారు.

శ‌నివారం నాటికి ఆన్‌లైన్‌లో బిల్లులు అప్‌లోడ్ చేయండి.. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉపాధి హామీ క‌న్వర్జెన్స్ నిధుల‌తో చేప‌ట్టిన ప‌నుల‌ను ఇక‌పై ప్రతివారం రికార్డ్‌ చేసి శ‌నివారం నాటికి ఆన్‌లైన్‌లో బిల్లులు అప్‌లోడ్ చేయాలని సూచించారు. పనుల నమోదు, బిల్లుల‌ అప్‌లోడ్ వంటి అంశాల్లో ఉపాధి హామీ సిబ్బంది, పంచాయ‌తీరాజ్ ఇంజినీరింగ్ విభాగాల మ‌ధ్య స‌మ‌న్వయం అవ‌స‌ర‌మ‌ని ఆదేశించారు. ఉపాధి హామీ, గ‌డ‌ప‌ గ‌డ‌ప‌కు-మ‌న‌ప్రభుత్వం కింద చేప‌ట్టిన ప‌నుల పురోగతిని తరచూ పర్యవేక్షించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

Jagan met Nirmala: కేంద్ర ఆర్థిక మంత్రితో సీఎం జగన్ భేటీ.. అందుకేనా..!

బిల్లుల చెల్లింపును ప్రభుత్వం వేగ‌వంతం చేస్తోంది.. అనంతరం ఉపాధి హామీ క‌న్వెర్జెన్స్‌, గ‌డ‌ప‌ గ‌డ‌ప‌కు మ‌న ప్రభుత్వం కార్యక్రమాల కింద మంజూరైన ప‌నుల‌కు రాష్ట్ర ప్రభుత్వం బిల్లుల చెల్లింపును వేగ‌వంతం చేస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రానున్న నాలుగు నెల‌ల్లో ఈ కార్యక్రమాల కింద చేప‌ట్టిన ప‌నుల‌కు బిల్లుల చెల్లింపులో స‌మ‌స్యలు ఉండ‌బోవని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాలో చేప‌ట్టిన ప‌నుల‌న్నీ పూర్తి చేసేలా అధికారులు చ‌ర్యలు చేప‌ట్టాల‌న్నారు.

పెండింగ్‌, అకాల వర్షాలపై చర్చించాం..మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ..''సచివాలయాలు, ఆర్బీకేఎస్, వాటి తాలుకా పనులపై సమీక్షా చేశాము. దాంతోపాటు పేమెంట్స్ మీద కూడా చర్చించాము. ఎప్పటికప్పుడు పనుల విషయంలో ఏమైనా సమస్యలు ఉన్నా, కమ్యునికేషన్ గ్యాప్‌ ఉన్నా వాటిపై కూడా చర్చిస్తాం. గడప గడప మన ప్రభుత్వం.. పనులు ఎంతవరకూ వచ్చాయి.. ఏమేమి పనులు పెండింగ్‌లో ఉన్నాయి..పెండింగ్‌లో ఉన్న పనులు ఎప్పుడు కంప్లీట్ చేస్తారు అనే విషయాలపై చర్చలు జరిపాము. ఇటీవలే కురిసిన అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన రైతులకు అందాల్సిన పరిహారం గురించి అధికారుల నుంచి వివరాలు తీసుకున్నాను. ఆయా శాఖల వారితో మాట్లాడి, పరిహారం అందించామని ఆదేశించాను.'' అని ఆయన అన్నారు.

Locals Protest Against MLA: గడగడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యేకు నిరసన సెగ.. రోడ్డుపై బైఠాయించిన మహిళలు

పెండింగ్ బిల్లులపై ఆదేశాలు..ఈ క్రమంలో జిల్లాలో మొదట సిగ్నెట‌రీ కింద అప్‌లోడ్ చేసిన రూ.38 కోట్లు, రెండో సిగ్నట‌రీ కింద అప్‌లోడ్ చేసిన బిల్లులు మ‌రో రూ.12 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయ‌ని ఇంజినీరింగ్ అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వాటిని త్వర‌లో చెల్లించేలా చ‌ర్యలు చేప‌ట్టాల‌ని.. పంచాయ‌తీరాజ్ శాఖ‌, రాష్ట్ర స్థాయి అధికారుల‌తో మంత్రి బొత్స ఫోన్‌లో మాట్లాడి సూచించారు. ప‌నుల‌కు సంబంధించి ఏవైనా స‌మ‌స్యలు ఉంటే త‌న దృష్టికి లేదా జిల్లా క‌లెక్టర్ దృష్టికి తీసుకువ‌స్తే ప‌రిష్కరిస్తామ‌న్నారు.

ఉపాధి హామీ పనులను ప‌ర్యవేక్షించాలి.. చివరగా జిల్లాలో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్రభుత్వం కింద రూ. 1055 ప‌నులు మంజూరు చేయ‌గా.. అందులో 858 ప్రారంభించ‌డం జ‌రిగింద‌ని పంచాయ‌తీరాజ్ ఎస్‌ఈ గుప్తా మంత్రికి వివ‌రించారు. ఆ పనులకు సంబంధించి ఇప్పటికే 83 బిల్లులు అప్‌లోడ్ చేశామ‌న్నారు. ఉపాధి హామీ, గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న‌ ప్రభుత్వం కింద చేప‌ట్టిన ప‌నులు ఎలా జ‌రుగుతున్నాయో త‌ర‌చుగా మండ‌లాల్లో ప‌ర్యవేక్షించాల‌ని డీపీఓ శ్రీ‌ధ‌ర్‌ రాజా, జిల్లా ప‌రిష‌త్ డిప్యూటీ సీఈఓ రాజ్‌కుమార్‌ల‌ను మంత్రి ఆదేశించారు.

CM KCR comments on NDA Govt : 'గవర్నర్ వ్యవస్థతో 'ఏదో' చేయాలని మోదీ ప్లాన్'

ABOUT THE AUTHOR

...view details