విశాఖ జిల్లా కల్యాణపులోవలో పోరురాజు తిరునాళ్లలో అపశృతి చోటు చేసుకుంది. రావికమతం మండలం కల్యాణపులోవలో ఆర్టీసీ బస్సు చక్రాల కిందపడి బాలుడు మృతి చెందాడు. బాలుడు మాకవరపాలెం మండల వాసి రోహిత్(5)గా గుర్తించారు.
రెండు లారీలు ఢీ
విజయనగరం జిల్లా కొమరాడ మండలం అర్తం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఓ లారీ డ్రైవర్ మృతి చెందాడు. మృతుడు గుంటూరు జిల్లాకు చెందిన సాంబయ్యగా గుర్తించారు.