రేపు విజయనగరంలో ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. విజయనగరంలో ఆయన 'జగనన్న వసతి దీవెన' పథకం ప్రారంభించనున్నారు. రేపు ఉదయం 9.10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి విజయనగరం పోలీసు శిక్షణ కళాశాలకు చేరుకుంటారు. అయోధ్య మైదానంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలిస్తారు. అనంతరం వసతి దీవెన పథకం ప్రారంభించి బహిరంగసభలో ప్రసంగించనున్నారు. తర్వాత పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్మించిన దిశ స్టేషన్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు తిరిగి తాడేపల్లి బయలుదేరతారు.
రేపు విజయనగరంలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన - ముఖ్యమంత్రి జగన్ విజయనగరం పర్యటన
రేపు విజయనగరంలో ముఖ్యమంత్రి జగన్ 'జగనన్న వసతి దీవెన' పథకాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించి మధ్యాహ్నం ఒంటిగంటకు తాడేపల్లి బయలుదేరతారు.
ముఖ్యమంత్రి జగన్