విజయనగరం జిల్లా ఆలూరు మండలంలోని కొదమ పంచాయతీ పరిధిలోని సొంతంగా రహదారి నిర్మాణానికి స్థానికులు ముందడుగు వేశారు. పట్టు చెన్నారు గ్రామం నుంచి కొదమ గ్రామానికి సుమారు 6.7 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇది మొత్తం కాలి నడక మార్గం. ఈ కొండ ప్రాంతంలో రహదారి వేయడం కష్టంతో కూడుకున్న పని. ఈ మార్గంలో కొండపై చోర అనే గ్రామం ఉంది. ఈ ప్రాంతం నుంచి గర్భిణులను, రోగులను మైదాన ప్రాంతానికి తరలించాలంటే ఎన్నో ఇబ్బందులు తప్పడం లేదు. సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో ఈ గ్రామాల్లోని యువకులకు వివాహాలు కూడా జరగడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంటికి రూ. 5వేల చొప్పున...
కొదమ, చోర గ్రామాల వారు రహదారి నిర్మాణానికి ముందుకు వచ్చారు. చోర గ్రామంలో సుమారు 70 కుటుంబాలు ఉండగా కొదమ పంచాయతీ కేంద్రంలో మరో 130 కుటుంబాల వరకు ఉన్నాయి. వీరంతా ఇంటికి రూ. 5 వేలు చొప్పున అందించేందుకు సిద్ధమయ్యారు.