ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AOB Villagers: 'మమ్మల్ని గుర్తించండి.. దయచేసి ఆంధ్రప్రదేశ్​లో కలిపేయండి' - ఆంధ్రాలో కలపాలని ఏవోబీ గిరిజనలు వేడుకోలు

'మమ్మల్ని ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు గుర్తించటం లేదు. దయచేసి ఆంధ్రాలో కలపండి' అంటూ ఆంధ్రా ఒడిశా గిరిజన గ్రామాల ప్రజలు రాష్ట్ర అధికారులకు మొర పెట్టుకున్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా తమకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

AOB tribes wanting to merge in Andhra
'తమను ఏ ప్రభుత్వమూ గుర్తించటం లేదు..దయచేసి ఆంధ్రాలో కలపండి'

By

Published : Jul 8, 2021, 10:05 PM IST

'తమను ఏ ప్రభుత్వమూ గుర్తించటం లేదు..దయచేసి ఆంధ్రాలో కలపండి'

'మమ్మల్ని ఒడిశా, ఏపీ ప్రభుత్వాలు గుర్తించటం లేదు. దయచేసి ఆంధ్రాలో అయినా కలపండి. మా కష్టాలు తీర్చండి' అంటూ ఆంధ్రా - ఒడిశా రాష్ట్రాల సరిహద్దు గిరిజన గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. విజయనగరం పాచిపెంట మండలం కోన వలసలో జరిగిన రైతు దినోత్సవానికి ఆయా గ్రామాల గిరిజనులు దాదాపు 200 మంది హాజరయ్యారు. తమను ఏ రాష్ట్ర ప్రభుత్వమూ గుర్తించడం లేదని.. ఆవేనద చెందారు. దయచేసి ఆంధ్రలో కలపాలని వైకాపా ఎమ్మెల్యే రాజన్నదొరను వేడుకొన్నారు.

బిట్ర, పిలక బిట్రా, బైల్​పాడు, బుర్ర మామిడి, ఈతమను వలస, జంగవలస తదితర 8 గ్రామాల ప్రజలు అధికారుల ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందటంలేదని వాపోయారు. గతంలో మాజీ ఎంపీ డిప్పల సూరిదొర హయంలో తమకు సాలూరు మండలం సారిక మొకసాలోని భూములు అందించారన్నారు. అందుకు సంబంధిచిన రాగి పత్రాలను గిరిజనులు అధికారులకు చూపించారు. 1950లో అందించిన రాగిపత్రాలు తెలుగు బాషలోనే ఉన్నట్లు అధికారులకు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details