ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నీటి సమస్యను అరికట్టాలని గర్భిణుల ఆందోళన - నీటి కోసం వసతి గృహంలోని గర్భిణీలు ఆందోళన వార్తలు

గత 2 వారాలుగా వాటర్‌ పైప్ లైన్‌లో పూడిక నిండి నీటి సరఫరా జరగడం లేదని.. సాలూరులో గర్భిణులు ఆందోళన చేశారు. గర్భిణుల వసతి గృహంలో ఉంటున్న వాళ్లంతా.. సమస్యపై ఆవేదన చెందారు. నీటి సమస్యను అరికట్టాలని డిమాండ్ చేశారు.

pregnant women to prevent water problem
నీటి సమస్యను అరికట్టాలని గర్భిణీల ఆందోళన

By

Published : Mar 30, 2021, 2:43 PM IST

నీటి సమస్యను అరికట్టాలని గర్భిణీల ఆందోళన

విజయనగరం జిల్లా సాలూరులోని గర్భిణుల వసతి గృహంలో నీటి సమస్యను అరికట్టాలంటూ.. అక్కడ ఆశ్రయం పొందుతున్న గర్భిణులు ఆందోళన చేశారు. గత 2 వారాలుగా వాటర్‌ పైప్ లైన్‌లో పూడిక నిండి నీటి సరఫరా జరగడం లేదని వాపోయారు. బయటి నుంచి నీళ్లు తెచ్చుకోడానికి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందారు.

నీళ్ల బకెట్లతో మెట్లు ఎక్కలేక పోతున్నామని వాపోయారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోవట్లేదన్నారు. వైటీసీలో శిక్షణ పొందుతున్న గిరిజన నిరుద్యోగ యువత.. బయటికెళ్లి నీటిని బకెట్లతో నీరు తీసుకొని రావాల్సిన పరిస్థితి ఏర్పడిదని తెలిపారు. భోజన శాలలో తాగునీరు, బాత్రూంలో నీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details