విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం పరిధిలోని గ్రామాల్లోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే 100 నెంబర్ కు ఫోన్ చేయాలని సాలూరు రూరల్ ఎస్సై దినకర్.. దండోరా వేయించారు. లాక్డౌన్ను అతిక్రమిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. గ్రామాల్లోకి కొత్త వ్యక్తులు వస్తే వారి సమాచారాన్ని గ్రామ వాలంటీర్లకు గానీ, సచివాలయ సిబ్బందికి తెలియజేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించి కరోనా వ్యాప్తిని నియంత్రించాలని కోరారు.
'కొత్త వ్యక్తులు కనిపిస్తే వెంటనే చెప్పండి'
విజయనగరం జిల్లాలో ఇప్పటి వరకూ ఒక్క కరోనా పాజిటివ్ కేసూ నమోదు కాలేదు. అయినప్పటికీ అధికారులు అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. సాలూరు నియోజకవర్గంలో ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ రాకుండా ఆంక్షలు విధించారు.
కొత్త వ్యక్తుల సమాచారం ఇవ్వాలని గ్రామాల్లో పోలీసుల దండోరా