FAKE CHALLANS SCANDAL: నకిలీ చలాన్ల వ్యవహారంలో ముగ్గురు సస్పెన్షన్ - ap news
18:53 September 01
శాఖాపరమైన చర్యలు చేపట్టిన అధికారులు
కార్యాలయాల్లో నకిలీ చలాన్ల వ్యవహారంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ.. శాఖాపరమైన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా గజపతినగరం సబ్ రిజిస్ట్రార్ ఈశ్వరమ్మతో పాటు సీనియర్ సహాయకుడు రమేశ్, జూనియర్ సహాయకుడు నరసింగరావును ఆ శాఖాధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు.. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ కల్యాణి ఉత్తర్వులు జారీ చేశారు.
గజపతినగరం సబ్ రిజిష్టర్ కార్యాలయంలో జరిగిన అక్రమాల్లో ఇప్పటికే.. నలుగురు దస్తావేజు లేఖర్లు, ఒక సహాయ డాక్యుమెంటరీ రైటర్, ఒక కంప్యూటర్ ఆపరేటర్ అరెస్టయ్యారు. స్థానిక గజపతినగరం సబ్ రిజిష్టర్ కార్యాలయంలో నకిలీ చలానాల పేరుతో 35లక్షల రూపాయల మేర అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఈ మేరకు.. ఓ దస్తావేజు లేఖరిపై అధికారులు ఫిర్యాదు చేశారు. దానిపై విచారణ చేపట్టిన గజపతినగరం పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో నలుగురు దస్తావేజు లేఖరు కాగా.. మరో ఇద్దరు సహాయ డాక్యుమెంటరీ రైటర్, కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నారు.
ఇదీ చదవండీ.. Viveka Murder Case: సునీల్ యాదవ్‌కు నార్కో పరీక్షలకు అనుమతి నిరాకరణ