విజయనగరం జిల్లా పార్వతీపురంలోని ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తల కోర్కెల దినోత్సవం సందర్భంగా నిరసన చేపట్టారు. సీఐటీయూ జిల్లా నాయకులు జి.వెంకటరమణ, శ్రామిక మహిళ నాయకులు లక్ష్మి ఆధ్వర్యంలో అంగన్వాడి కార్యకర్తలు నిరసన తెలియజేశారు. అంగన్వాడి కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని.. ఐసీడీఎస్ బడ్జెట్ కేటాయింపులు రెట్టింపు చేయాలని.. కేంద్రాల ద్వారా అందిస్తున్న ఆహార నాణ్యత పెంచాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు కనీస వేతనం రూ.30000, సహాయకులకు రూ.21000 ఇవ్వాలని, పింఛన్, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని కోరారు.
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. అంగన్వాడి కార్యకర్తల నిరసన - పార్వతీపురం వార్తలు
అంగన్వాడీ కార్యకర్తల కోర్కెల దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా పార్వతీపురంలోని ఐసీడీఎస్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కొవిడ్ విధుల్లో ఉన్న అంగన్వాడీలకు రూ.25000 అలవెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న బిల్లులను చెల్లించాలని కోరారు. అంగన్వాడి కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. అంగన్వాడి కార్యకర్తల నిరసన