రాష్ట్ర ప్రభుత్వం తనను అణగదొక్కాలని చూస్తుందని, తనపై కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చూశారని.. ఆయుర్వేద నిపుణుడు నెల్లూరు ఆనందయ్య అన్నారు. కరోనా చికిత్స కోసం తాను కనిపెట్టిన మందు ప్రజల్లోకి వెళ్లకుండా చాలా అడ్డంకులు సృష్టించారని ఆరోపణలు చేశారు. ఆ సమయంలో గ్రామస్థులంతా అండగా నిలవడం వల్లే.. అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులు వెనుదిరిగారని ఆయన తెలిపారు. ఎంతోమంది కరోనా రోగులను ప్రాణాపాయం నుంచి రక్షించానని, ఉచితంగా అందరికి కరోనా మందుని అందించానని ఆనందయ్య అన్నారు.
Anandaiah: కరోనా మందు ప్రజల్లోకి రానివ్వలేదు: ఆనందయ్య - కరోనా మందు ప్రజల్లోకి రానివ్వలేదని ఆనందయ్య మండిపాటు వార్తలు
కరోనా చికిత్స కోసం తాను కనిపెట్టిన మందు ప్రజల్లోకి వెళ్లకుండా.. ప్రభుత్వం చాలా అడ్డంకులు సృష్టించిందని ఆయుర్వేద నిపుణుడు నెల్లూరు ఆనందయ్య అన్నారు. ప్రభుత్వం తనను అణగదొక్కాలని చూస్తుందని, తనపై కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చూశారని ఆరోపించారు.
కరోనా మందు ప్రజల్లోకి రానివ్వలేదు: ఆనందయ్య
TAGGED:
anandaiah fires on ycp govt