మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కత్తితో దాడి - విజయనగరం జిల్లా గరుగుపల్లి మండలం ఆర్ డి వలస
మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో వ్యక్తి పై దాడి చేసిన ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. బాధితుల్ని స్థానికులు పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు .
చికిత్స పొందుతున్న బాధితుడు
విజయనగరం జిల్లా గరుగుపల్లి మండలం ఆర్డి వలసలో కిరణ్ అనే యువకుడిని అదే గ్రామానికి చెందిన సురేశ్ మద్యం కోసం వంద రూపాయలు అడిగాడు. డబ్బులు లేవని కిరణ్ చెప్పడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దాంతో సురేష్ కత్తితో కిరణ్‌పై దాడి చేశాడు. కిరణ్‌కి మూడు చోట్ల కత్తి గాట్లు పడ్డాయి. స్థానికులు క్షతగాత్రుడిని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.