ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయనగరం జిల్లాలో అంబేడ్కర్ వర్ధంతి - పార్వతీపురంలో అంబేడ్కర్​ వర్ధంతి

బీఆర్ అంబేడ్కర్ 64వ వర్ధంతిని పురస్కరించుకుని విజయనగరం జిల్లావ్యాప్తంగా నేతలు, ప్రముఖులు నివాళులర్పించారు. ఆయన​ విగ్రహానికి పూలమాలలు వేశారు. సేవలు స్మరించుకున్నారు.

Ambedkar death anniversary at Vizianagaram
విజయనగరం జిల్లాలో అంబేడ్కర్​కు ఘన నివాళులు

By

Published : Dec 6, 2020, 5:58 PM IST

భారత రాజ్యాగ నిర్మాత అంబేడ్కర్ సేవలు ప్రపంచం గర్వించదగినవని ఎంపీ బెళ్లన చంద్రశేఖర్ కొనియాడారు. ఆయన 64వ వర్ధంతిని పురస్కరించుకుని విజనయగరం జిల్లా చీపురుపల్లిలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. విశ్వవిఖ్యాత మేధావిగా పేరు పేరుగాంచిన ఆయన సామాజిక వైషమ్యాలపై పోరాడి విజయం సాధించిన గొప్ప సంఘసంస్కర్త అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పార్వతీపురంలో అంబేడ్కర్​ వర్ధంతిని నిర్వహించారు. భాజపా ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం, రైల్వే ఎంప్లాయిస్ యూనియన్, అమ్మ యువజన సంఘం నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భాజపా నాయకులు అన్నారు.

అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకుని.. మహారాజ కళాశాలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని ఎస్​ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ దగ్గర ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి విద్యార్థి సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. మాన్స్​స్ యాజమాన్యం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల విద్యార్ధులకు ఉచిత విద్య దూరం అవుతోందని ఆవేదన చెందారు.

ఇదీ చదవండి:

అంతు చిక్కని పరిస్థితులు.. ఇంకా నమోదవుతున్న అస్వస్థత కేసులు

ABOUT THE AUTHOR

...view details