ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'విద్యార్థులు అంబేడ్కర్ అడుగుజాడల్లో నడవాలి' - విజయనగరంలో అంబేడ్కర్ జయంతి వార్తలు

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్. అంబేడ్కర్ 130వ జయంతిని విజయనగరంలో ఘనంగా నిర్వహించారు.ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ హరిజవహర్​లాల్, జిల్లా ఎస్పీ రాజకుమారి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Ambedkar birth anniversary at Vizianagaram
అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలేసిన జిల్లా కలెక్టర్ హరిజవహర్​లాల్, జిల్లా ఎస్పీ

By

Published : Apr 14, 2021, 10:27 AM IST

డాక్టర్ అంబేడ్కర్ 130వ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. విజయనగరం సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిజవహర్​లాల్, ఎస్పీ రాజకుమారి పాల్గొన్నారు. బాలాజీ జంక్షన్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.. విద్యార్థులు అంబేడ్కర్ అడుగుజాడల్లో నడవాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు ఏకైక లక్ష్యం విద్యని పేర్కొన్నారు. సమాజంలో వెనుకబాటుతనం పోవాలంటే విద్యే మార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో జేసీలు కిషోర్ కుమార్, వెంకటరావు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details