విజయనగరం జిల్లాలో ఘనంగా అంబేడ్కర్ జయంతి - Ambedkar Jayanti News in parvathipuram
విజయనగరం జిల్లాలో అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాలోని శృంగవరపుకోట, పార్వతీపురంలోని పలు సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీ నేతలు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
విజయనగరం జిల్లాలో ఘనంగా అంబేడ్కర్ జయంతి
విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక సీఐ శ్రీనివాసరావు భౌతిక దూరం పాటిస్తూ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఎస్సీ సంఘాల నాయకులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. పార్వతీపురం ఆసుపత్రి కూడలిలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవి పూలమాల వేసి అంజలి ఘటించారు.