ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 8, 2020, 2:43 PM IST

Updated : Dec 8, 2020, 7:16 PM IST

ETV Bharat / state

జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా బంద్.. వామపక్షాల ర్యాలీ

విజయనగరం జిల్లావ్యాప్తంగా భారత్​ బంద్ ప్రశాంతంగా కొనసాగింది. ప్రధాన కూడళ్లలో వామపక్ష పార్టీ నాయకులు ర్యాలీ చేపట్టారు. దుకాణాలు మూసివేశారు. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా బంద్.. వామపక్షాల ర్యాలీ
జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా బంద్.. వామపక్షాల ర్యాలీ

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో రైతులు చేస్తున్న పోరాటాన్ని విజయవంతం చేయాలని వామపక్ష నాయకులు పిలుపునిచ్చారు. భారత్ బంద్​లో భాగంగా జిల్లాలోని పలు కూడళ్లలో వామపక్షాల ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు.

నిర్మానుష్యంగా బస్ స్టేషన్

ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, వాణిజ్య సముదాయలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు, లారీలు తిరగకపోవటంతో.., జిల్లా పరిధిలోని జాతీయ రహదారులన్నీ బోసిపోయాయి. జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాల్లో భారత్ బంద్​కు మద్ధతుగా ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. వామపక్షాలు, కార్మిక, రైతు సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. నగరంలోని కోట కూడలి నుంచి, ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, కేంద్రం తీరుకు నిరసనగా కార్డులు ప్రదర్శించారు. కేంద్రం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలు కార్పొరేట్ సంస్థలకు మాత్రమే మేలు చేకూరుస్తాయని సీపీఎం రాష్ట్ర నాయకులు కృష్ణమూర్తి తెలిపారు. పలు చట్టాలను బడా సంస్థలకు అనుకూలంగా మార్చిన కేంద్రం.., వ్యవసాయాన్ని కూడా దారాదత్తం చేసే కుట్ర పన్నిందని ఆరోపించారు.

దుకాణాలు మూసేయిస్తున్న వామపక్షాలు

బొబ్బిలిలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. ఎన్టీఆర్ హోటల్ నుంచి మార్కెట్ మీదుగా చర్చ్ సెంటర్ వరకు వామపక్ష నాయకులు ర్యాలీ నిర్వహించారు. వారికి మద్దతుగా పట్టణంలోని దుకాణాలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. పార్వతీపురంలో ప్రజా సంఘాలు చేపట్టిన బంద్ పాక్షికంగా జరిగింది. ఎడ్లబండిపై ప్రధాన రహదారిల్లో తిరుగుతూ.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా సంఘాల నాయకులు నినాదాలు చేశారు. దుకాణాలు మూసివేయించారు. అయితే కొద్దిసేపటికే మళ్లీ దుకాణాలు తెరుచుకున్నాయి.

జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం ఎదుట ఆందోళన

జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సులు నిలిచిపోవటంతో..చీపురుపల్లి కాంప్లెక్స్ నిర్మానుష్యంగా మారింది. బంద్​కు మద్దతుగా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జమ్ము ఆదినారాయణ, సీఐటీయూ నాయకుడు మజ్జి గౌర్​నాయుడు ఆధ్వర్యంలో ఎల్​ఐసీ ఆఫీస్ ఎదుట ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్యవసాయ బిల్లులను రద్దు చేసి, ప్రభుత్వాలు రైతులకు అండగా నిలవాలని కోరారు. బంద్ నేపథ్యంలో డీఎస్పీ మోహన్ రావు ఆధ్వర్యంలో పట్టణంలో పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని కూడళ్లలో పోలీసులు పహారా కాశారు.

తెదేపా ఆధ్వర్యంలో ర్యాలీ

ఇవీ చూడండి:

'తక్షణమే రూ. 10వేలు అందజేసి కర్షకులను ఆదుకోవాలి'

Last Updated : Dec 8, 2020, 7:16 PM IST

ABOUT THE AUTHOR

...view details