ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వ్యవసాయ బిల్లులను వెనక్కు తీసుకోవాలంటూ నిరసన - విజయనగరంలో రైతు సంఘాల నిరసన వార్తలు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విజయనగరంలో రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. కేంద్రం తీసుకొచ్చిన 3 వ్యవసాయ బిల్లులతో దేశంలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు.

dharna in vizianagaram
వ్యవసాయ బిల్లులను వెనక్కు తీసుకోవాలంటూ నిరసన

By

Published : Dec 14, 2020, 5:00 PM IST

మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ... రైతు సంఘాల ఆధ్వర్యంలో విజయనగరం బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు.

సీపీఎం నాయకులు తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. కేంద్రం తీసుకొచ్చిన 3 వ్యవసాయ బిల్లులతో దేశంలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. ఈ రైతు వ్యతిరేక బిల్లులను వెనక్కు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details