ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కేదార్​నాథ్ చెరువు ఆక్రమణ.. అప్రమత్తమైన అధికారులు - ఆక్రమణ తొలగింపు...

విజయనగరం జిల్లా ఎస్.కోట పట్టణంలో సర్వేనెంబరు 551-4 లో కేదార్​నాథ్ చెరువు గర్భాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించి ఫెన్సింగ్ వేశారు. ఆయకట్టు రైతులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆక్రమణను గుర్తించిన అధికారులు జెసిబితో ఫెన్సింగ్ తొలగించి ప్రభుత్వ స్థలం అంటూ బోర్డు ఏర్పాటు చేశారు.

ఆక్రమణ తొలగింపు...

By

Published : May 7, 2019, 1:21 PM IST

ఆక్రమణ తొలగింపు...

విజయనగరం జిల్లా ఎస్. కోట పట్టణంలో సర్వే నెంబరు 551-4 లో కేదార్​నాథ్ చెరువు గర్భాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించి ఫెన్సింగ్ వేయడంతో చెరువు కింద ఆయకట్టు రైతులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆక్రమణకు గురైన 71 సెంట్ల స్థలం ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం సుమారు మూడు కోట్ల పైచిలుకు ఉంటుందని రెవెన్యూ అధికారులు తెలిపారు. సోమవారం తహసీల్దార్ రామారావు ఆధ్వర్యంలో హెచ్డిటి, మండల సర్వేయర్, రెవెన్యూ ఇన్​స్పెక్టర్​, VROలతో కూడిన బృందం వెళ్లారు. ఆక్రమణను గుర్తించి జెసిబితో ఫెన్సింగ్ తొలగించి ప్రభుత్వ స్థలం అంటూ బోర్డు ఏర్పాటు చేశారు.ఈ స్థలం ఆక్రమించి ఫెన్సింగ్ వేసిన వారిపై పోలీస్ స్టేషన్​లో కేసు నమోదు చేస్తామని తహసీల్దార్ రామారావు ప్రకటించారు. ఈ విషయంపై చెరువు కింద ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details