ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎరువుల దుకాణాల్లో వ్యవసాయ అధికారుల దాడులు - విజయనగరం జిల్లాలో వ్యవసాయశాఖ వార్తలు

విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలోని సాలూరు వ్యవసాయ సహాయ సంచాలకులు మధుసూదన రావు ఆధ్వర్యంలో ఎరువుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ లైసెన్సులు ఉన్న దుకాణాల్లో మాత్రమే ఎరువులు కొనుగోలు చేయాలని సూచించిన ఆయన సరైన పత్రాలు లేని దుకాణాల్లో అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

Agriculture department officers chicks in Fertilizer stores
ఎరువుల దుకాణాల్లో వ్యవసాయ అధికారుల దాడులు

By

Published : Jun 29, 2020, 9:52 PM IST


ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చిన ఎరువుల దుకాణాల్లో మాత్రమే రైతులు కొనుగోలు చేయాలని సాలూరు వ్యవసాయ సహాయ సంచాలకులు మధుసూదన రావు తెలిపారు. విజయనగరం జిల్లా పలు ఎరువుల దుకాణాల్లో తనిఖీలు చేపట్టిన ఆయన ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చిన దుకాణాల్లో మాత్రమే ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు కొనుగోలు చేసి బిల్లులు పొందాలన్నారు. అనంతరం కురుపాం మండలంలోని పూతికవలస గ్రామం వద్ద ఓ ఎరువుల దుకాణంలో కంపెనీకి చెందిన సరైన పత్రాలు లేకపోవడం వల్ల రూ 4.44 లక్షల విలువగల ఎరువుల అమ్మకాలు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తనిఖీల్లో మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details