ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 17, 2021, 10:22 PM IST

ETV Bharat / state

RBK's: 'రైతు సంక్షేమానికి ఆర్బీకేలు కేంద్ర బిందువు'

వ్యవసాయశాఖ కమిషనర్ హనుమంతు అరుణ్ కుమార్ విజయనగరం జిల్లాలో పర్యటించారు. కలెక్టరెట్​లో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన ఆయన..రానున్న రోజుల్లో రైతు సంక్షేమానికి, వ్యవసాయానికి రైతు భరోసా కేంద్రాలు కేంద్రబిందువు కానున్నాయన్నారు.

agriculture commissioner comments
రైతు సంక్షేమానికి ఆర్బీకేలు కేంద్ర బిందువు

రానున్న రోజుల్లో రైతు సంక్షేమానికి, వ్యవసాయ రంగానికి రైతు భరోసా కేంద్రాలు కేంద్రబిందువు కానున్నాయని వ్యవసాయశాఖ కమిషనర్ హనుమంతు అరుణ్ కుమార్ అన్నారు. విత్తనం నుంచి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం దాకా అన్నీ ఆర్బీకేల్లో జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విజయనగరం జిల్లాలో పర్యటించిన ఆయన..కలెక్టరేట్​లో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జులై 8న రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఆ రోజు జిల్లాలో 200కు పైగా రైతు భరోసా కేంద్రాలు, మూడు సమగ్ర వ్యవసాయ పరీక్షా కేంద్రాలను సీఎం జగన్ వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నట్లు చెప్పారు.

మార్కెట్ రేట్లను పరిశీలించిన అనంతరం రెండు రోజుల్లో వ్యవసాయ యంత్ర పరికరాల ధరలను ఖరారు చేయాలని ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాలు, ఎరువులతోపాటు రైతులకు కావాల్సిన చిన్న చిన్న పరికరాలు, పనిముట్లను కూడా అందుబాటులో ఉంచాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details