ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయనగరం నుంచి.. రోడ్డెక్కిన బస్సులు - బస్సుల సర్వీసుల తాజా వార్తలు

లాక్​డౌన్​ అనంతరం విజయనగరం జిల్లాలో బస్సులు బయలుదేరాయి. జిల్లాలోని నాలుగు డిపోల పరిధిలో 70 సర్వీసులను ఆర్టీసీ అధికారులు ప్రారంభించారు. కరోనా నియంత్రణకు జాగ్రత్తలు పాటిస్తూ బస్సులు నడిపిస్తున్నట్లు ఆర్టీసీ సిబ్బంది పేర్కొన్నారు.

after lock down buses started
ప్రారంభమైన బస్సుల ప్రయాణం

By

Published : May 21, 2020, 11:58 AM IST

లాక్​డౌన్​ సడలింపులతో ఆర్టీసీ బస్సులు ప్రజా రవాణాకు బయల్దేరాయి. ఉదయం 7 గంటల నుంచే రాకపోకలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 4 డిపోల్లో 70 సర్వీసులను అధికారులు ప్రారంభించారు. విశాఖపట్నం, పాలకొండ, శ్రీకాకుళం, శృంగవరపుకోట, అనకాపల్లి ప్రాంతాలకు సర్వీసులు కొనసాగుతున్నాయి.

సాలూరు డిపో నుంచి విశాఖ, విజయనగరం, పార్వతీపురం, రాజాం, బొబ్బిలికి బస్సులు నడుపుతున్నారు. పార్వతీపురం నుంచి విశాఖ, విజయనగరం, గుమ్మలక్ష్మీపురం, సాలూరు, పాలకొండకు సర్వీసులు నడుస్తున్నాయి. శృంగవరపుకోట డిపో నుంచి ధర్మవరం, విశాఖ, అరకుకు బస్సులు తిప్పుతున్నారు.

నాన్ స్టాప్ బస్సుల్లో మాత్రమే టిక్కెట్లు అన్ లైన్ బుకింగ్ ఏర్పాటు చేశారు. మిగిలిన అన్ని రకాల బస్సుల్లో అక్కడకక్కడే పాయింట్ల వద్ద గ్రౌండ్ బుకింగ్ ద్వారా ప్రయాణికులకు టికెట్లు జారీ చేస్తున్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా అధికారుల సూచనల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సిబ్బంది వెల్లడించారు.

ఇవీ చూడండి:

విజయనగరం జిల్లాలో అంపన్ ప్రభావం... ఎగసిపడుతున్న అలలు

ABOUT THE AUTHOR

...view details