ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ఏ ప్రయోజనాలు ఆశించి ఈ నిర్ణయం తీసుకున్నారు'

By

Published : Oct 9, 2020, 5:33 PM IST

విజయనగరంలోని మహారాజా కళాశాల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ... ఏసీటీఏ సభ్యులు సమావేశమయ్యారు. ఏ ప్రయోజనాలు ఆశించి ఈ నిర్ణయం తీసుకున్నారో తెలపాలని డిమాండ్ చేశారు.

ACTA members meeting in vizianagaram
ఏసీటీఏ సభ్యుల సమావేశం

విజయనగరంలోని మహారాజ స్వయం ప్రతిపత్తి డిగ్రీ కళాశాల ప్రైవేటీకరిస్తూ .. మాన్సాస్ ట్రస్ట్ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ఎఫిలెటెడ్ కళాశాలల ఉపాధ్యాయల అసోసియేషన్(ఏసీటీఏ) సమావేశమైంది. ఈ సమావేశానికి ఏసీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్​రావు, కళాశాల ఏసీటీఏ ఛైర్మన్ చిన్నారావు హాజరయ్యారు.

మహారాజా కళాశాల వ్యవహారంలో... మాన్సాస్ ట్రస్టు నిర్ణయంపై ఏసీటీఏ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస సమాచారం లేకుండా.. అధ్యాపకులు, విద్యార్ధుల అభిప్రాయలను పరిగణలోకి తీసుకోకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం విచారకరమన్నారు. ఏ ప్రయోజనాలు ఆశించి ఈ నిర్ణయం తీసుకున్నారో తెలపాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, మహారాజా కళశాల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో తీవ్ర స్థాయి ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details