విజయనగరం జిల్లా సాలూరు మండలం మరిపల్లిలో.. జరిగిన హత్య కేసులో నిందితుడికి కోర్టు శిక్ష ఖరారు చేసింది. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నట్లు పార్వతీపురం రెండవ అదనపు జిల్లా కోర్టు తీర్పునిచ్చింది.
హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష - మరిపల్లి హత్య కేసు న్యూస్
హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి.. పార్వతీపురం రెండవ అదనపు జిల్లా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
2015 జూలై 28న కొండ్రు సింహాచలం అనే వ్యక్తి.. గ్రామ సమీపంలో ఉన్న మహాదేవ బుచ్చినాయుడు, అల్తి సింహాచలంపై గడ్డపారతో దాడి చేశారు. ఈ దాడిలో మహాదేవ బుచ్చినాయుడు మృతి చెందగా, సింహాచలం గాయాలపాలయ్యారు. మృతుడి భార్య సత్యవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. వాదనలు విన్న కోర్టు.. నిందితుడైన కొండ్రు సింహాచలంకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు పదివేల నగదు జరిమానా విధిస్తున్నట్లు తీర్పునిచ్చింది.
ఇదీ చదవండి:కుమారుడి కళ్లెదుటే... రిక్షాలో కరోనాతో తండ్రి మృతి