వాగు దాటుతూ ప్రమాదవశాత్తూ నీటిలో గల్లంతై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన విజయనగరంజిల్లా కుంబికోట వద్ద చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లాడి గుప్త కురుపాంలో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నాడు. దుకాణం మూసేసి తిరిగి గ్రామానికి వచ్చే క్రమంలో గుమ్మిడిగెడ్డ వాగు దాటుతుండగా.. ప్రవాహ ఉద్దృతికి నీటిలో మునిగి చనిపోయాడు. కొద్ది దూరంలో మృతదేహన్ని వెలికితీసిన గ్రామస్తులు...అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన జరగిందని ఆరోపించారు. గుమ్మడిగెడ్డ వద్ద వంతెన నిర్మించాలని ఎన్నిసార్లు మెురపెట్టుకున్నా... అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూనే ఉన్నారని వాపోయారు. మృతిడి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు.
ప్రమాదవశాత్తు వాగులో పడి వ్యక్తి మృతి - Accidental death of a person in vizayanagaram
విజయనగరం జిల్లా కుంబికోటలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు వాగులో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని గ్రామస్తులు ఆరోపించారు.
వాగులో పడి వ్యక్తి మృతి