క్రేన్ తెగిపడి మహిళ కార్మికురాలు మృతి చెందిన సంఘటన విజయనగరం జిల్లా గరివిడి మండలంలో జరిగింది. గరివిడి మండలం వెదుల్లవలస గ్రామానికి చెందిన పాండ్రంకి నాగమణి అనే కాంట్రాక్ట్ కార్మికురాలు.. గరివిడిలోని ఫేకర్ ఫ్యాక్టరీలో పని చేస్తోంది. పరిశ్రమలోని కొలిమి నుంచి తయారైన అతి బరువైన ఫెర్రో లోహాల దిమ్మెలను కిందికి దించేందుకు ఉపయోగించే క్రేన్ సుమారు 30 అడుగులు ఎత్తు నుంచి ఒక్కసారిగా కుప్పకూలి కిందికి పడిపోయింది. ఆ సమయంలో అక్కడ పని చేస్తున్న నాగమణిపై క్రేన్ పడింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందింది.
crane accident : పరిశ్రమలో ప్రమాదం... కార్మికురాలు మృతి - క్రేన్ తెగిపడి ఒప్పంద కార్మికురాలు మృతి
విజయనగం జిల్లా గరివిడి మండలంలోని ఫేకర్ పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగింది. ఫెర్రో లోహాల దిమ్మలను కిందకు దించేందుకు ఉపయోగించే ఎలక్ట్రిక్ ఓవర్హెడ్ ట్రావెలింగ్ (ఈవోటీ) క్రేన్ తెగిపడి ఓ మహిళా కార్మికురాలు మృతి చెందింది
గరివిడి మండలం ఫేకర్ పరిశ్రమలో క్రేన్ తెగిపడి ఒప్పంద కార్మికురాలు మృతి
మృతురాలికి భర్త, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. నాగమణి మృతితో వెదుల్లవలస గ్రామంలో విషాదం నెలకొంది. నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. ఫేకర్ లో ఇటువంటి ప్రమాదం జరగడం ఇదే తొలిసారి అని పరిశ్రమ నిర్వాహకులు తెలిపారు. నిర్వహణకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఇలా జరగడం బాధాకరమన్నారు.
ఇదీ చదవండి:Low Pressure : బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాష్ట్రానికి వర్ష సూచన