ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ACB raids: మెంటాడ తహసీల్దార్ కార్యాలయంలో అనిశా సోదాలు - అనిశా సోదాల వార్తలు

విజయనగరం జిల్లా మెంటాడ తహసీల్దార్ కార్యాలయంలో అనిశా సోదాలు కొనసాగుతున్నాయి. సైనికోద్యోగుల భూ కేటాయింపుల్లో జాప్యం, మ్యుటేషన్లు, పాసుపుస్తకాల జారీలో నిర్లక్ష్యం, ఈ-పాసు పుస్తకాలు ఇవ్వకుండా ఆపారనే ఫిర్యాదులపై తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

ACB
ACB

By

Published : May 6, 2022, 5:31 AM IST

విజయనగరం జిల్లా మెంటాడ తహసీల్దారు కార్యాలయంపై ఆధారాలతో కూడిన ఆరోపణలు వచ్చినందునే.. సిబ్బందితో పలు దస్త్రాలు పరిశీలన, సోదాలు చేస్తున్నట్లు అవినీతి నిరోదక శాఖ డీఎస్సీ పి.రామంద్రరావు తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 14400 నంబరుకు మండల వాసులు చేసిన పలు ఫిర్యాదులపై సోదాలు చేపట్టామన్నారు. ఈ కార్యాలయంలో ఒకరి పేరున ఉన్న భూమి మరొకరి పేరున మార్పు చేసేందుకు మ్యూటేషన్లకు పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని.. నెల రోజుల్లో ఈ పాస్ పుస్తకాలు జారీ చేయాల్సి ఉండగా, ఆ పుస్తకాలు చెన్నై నుంచి కార్యాలయానికి చేరుకున్నప్పటికీ వాటిని రైతులకు జారీ చేయకుండా.. డబ్బుల కోసం అట్టి పెట్టుకొంటున్నారని ఫిర్యాదులు వచ్చాయన్నారు.

ఒకరి పేరున ఉన్న డి పట్టా భూములను మరొకరి పేరున బదలాయిస్తున్నారని.. విశ్రాంత సైనికోద్యోగులు భూ కేటాయింపుల్లో, పలు ధ్రువపత్రాల జారీలో.. రేషన్​ కార్డులు అందజేయడంలో జాప్యం వంటి తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయన్నారు. ఈ నెలలో ఇప్పటి వరకూ ఈ మండలం నుంచే ఎక్కువగా ఫిర్యాదులు అందాయన్నారు. ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో భూబదాలాయింపుకు సంబంధించిన మ్యూటేషన్ల దస్త్రాలు, ఈ పాస్ పుస్తకాలు, ఎన్నికల గుర్తింపు కార్డులు, రేషన్​ కార్డులు..వంటివి లబ్ధిదారులకు అందించకుండా అంటిపెట్టుకున్నట్లు గుర్తించామన్నారు. ఈ సోదాలు మరిన్ని రోజులు కొనసాగించే అవకాశం ఉందన్నారు.

ఇదీ చదవండి:ACB raids: బొల్లాపల్లి తహశీల్దార్‌ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు

ABOUT THE AUTHOR

...view details