ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పీఆర్ డీఈఈ కర్రి నాగేశ్వరరావు ఇంట్లో అనిశా సోదాలు - సాలూరు పీఆర్ డీఈఈ కర్రి నాగేశ్వరరావుపై ఏసీబీ ప్రశ్నల వర్షం

విజయనగరం జిల్లా సాలూరులో.. పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కర్రి నాగేశ్వరరావును అనిశా అధికారులు విచారించారు. దాదాపు రూ. కోటి 80 లక్షల విలువైన స్థిరాస్తులు గుర్తించినట్లు.. ఆ విభాగ డీఎస్పీ రమణమూర్తి వెల్లడించారు.

acb raid
సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు

By

Published : Nov 17, 2020, 9:47 PM IST

అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారనే అభియోగంపై.. విజయనగరం జిల్లా సాలూరులో పంచాయతీ రాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కర్రి నాగేశ్వరావును అనిశా అధికారులు ప్రశ్నించారు. రుషికొండ ప్రాంతంలోని ఆదిత్య అపార్ట్మెంట్​ నుంచి తీసుకు వచ్చి విచారణ ప్రారంభించారు.

ఇప్పటివరకు ఇల్లు, స్థలాలు తదితర 20 రకాల స్థిరాస్తులు గుర్తించామని.. వీటి డాక్యుమెంట్ విలువు సుమారు రూ. కోటి 80 లక్షల వరకు ఉంటుందని ఏసీబీ డీస్పీ రమణమూర్తి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details