ఈఎస్ఐ కుంభకోణం కేసులో ఇప్పటికే 12 మందిని అరెస్టు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. మరో ఏడుగురిని అరెస్టు చేయాల్సి ఉందన్నారు ఇప్పటివరకు 19 మంది నిందితులపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ కేసులో మరికొందరిని విచారించాల్సి ఉందన్నారు. త్వరలో ఛార్జిషీట్ దాఖలు చేస్తామని చెప్పారు.
'ఈఎస్ఐ కేసులో మాజీ మంత్రి పితాని పాత్రపై ఆధారాల్లేవు'
ఈఎస్ఐలో ఔషధాలు, పరికరాలు కొనుగోలు కేసులో ఇప్పటి వరకు రూ.105కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు గుర్తించామని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ అన్నారు. ఈకేసులో ఇప్పటి వరకు 19మందిని నిందితులుగా గుర్తించామని.. వీరిలో 12మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు ఈ పరికరాలు కొనుగోలు చేసినట్లు తెలిపారు. కేటాయించిన బడ్జెట్ కన్నా ఎక్కువ నిధులను వినియోగించారని తెలిపారు. వీటిలో అధికారుల పాత్ర కూడా ఉందా అనేనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పాత్రపై ఆధారాలు లేవన్నారు.
ఈఎస్ఐ 2014 - 19 మధ్య మందుల కొనుగోలు కేసులో దర్యాప్తు కొనసాగుతోందని అవినీతి నిరోధక శాఖ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. సుమారు రూ.970 కోట్లు బడ్జెట్ కేటాయింపులు జరిగాయన్నారు. రూ.106 కోట్లు విలువచేసే మందులు కొనుగోలు చేశారని తెలిపారు. మందులు కాంట్రాక్టు లేకుండా కొనుగోలు చేసినట్లు గుర్తించామని రవికుమార్ అన్నారు. లక్షకు మించిన కొనుగోళ్లు జరపాలంటే టెండర్ ప్రక్రియతోనే చేయాలని.. ఉద్యోగుల ద్వారా అప్పటికపుడు బోగస్ కంపెనీ పుట్టించి మందులు సప్లై చేశారని తెలిపారు. అచ్చెన్నాయుడు లెటర్లపై ఆర్డర్ చేస్తూ సంతకాలు చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు. 200 రూపాయలు అయ్యే ఈసీజీకి రూ.480 ఛార్జ్ చేశారని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు.
ఇదీ చదవండి: ఆయన కరోనా బారిన పడటం బాధాకరం: చంద్రబాబు