ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆన్​లైన్​ క్లాసుల పేరుతో అధిక ఫీజుల వసూళ్లకు అడ్డుకట్ట వేయండి' - private school fees latest news update

కరోనా కష్టకాలంలో ఆన్​లైన్​ క్లాసుల పేరుతో కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్​ చేశారు. విజయనగరం విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టిన వారు జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాల్లో జరుగుతున్న ఫీజులదందాలను అరికట్టాలని ఏబీవీపీ నాయకులు కోరారు.

ABVP leaders protest against to Private schools
ఏబీవీపీ నాయకుల నిరసన

By

Published : Jul 3, 2020, 4:58 PM IST

ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా అడ్మిషన్లు తీసుకున్న పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని, ఏబీవీపీ నాయకులు విజయనగరం విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. కరోనా లాక్​డౌన్​లో 50% ఉపాధ్యాయులను తొలగిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆర్ రమణ, జిల్లా కన్వీనర్ సాయి స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ రోహిత్ తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details