ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేర్వేరుచోట్ల నదిలో యువకులు గల్లంతు.. ఒకరు మృతి

వేర్వేరుచోట్ల నదిలో స్నానానికి వెళ్లిన యువకులు ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. ఈ ప్రమాదాల్లో ఒకరు మృతిచెందగా.. మరొకరి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

man missing in a river
నదిలో యువకులు గల్లంతు

By

Published : Jun 18, 2021, 10:10 AM IST

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరుకు చెందిన వెంకటసాయి.. ఆత్మకూరు కాలువలో గల్లంతయ్యారు. గురువారం సాయంత్రం..స్నేహితులతో కలిసి సాయి కాలువలోకి స్నానానికి వెళ్లారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో సాయి కొట్టుకుపోయాడు. అతని స్నేహితులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు, ఎన్​డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చేపట్టారు. రాత్రి 11గంటల వరకూ ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఇవాళ ఉదయం తిరిగి గాలింపు చేపడతామని పోలీసులు తెలిపారు.

యువకుడి మృతదేహం లభ్యం..

విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి వద్ద నాగావళి నదిలో స్నానానికి వెళ్లి గల్లంతై యువకుడు మృతి చెందాడు. పార్వతీపురం మండలం కోటవానివాలస గ్రామానికి చెందిన ఆళ్లు దుర్గాప్రసాద్.. బుధవారం సాయంత్రం తోటపల్లి రిజర్వాయర్ స్పిల్ వే వద్ద నాగావళి నదిలో పడి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం లభ్యమైన యవకుడి మృతదేహన్ని గరుగుబిల్లి పోలీసులకు అప్పగించారు. స్నేహితుడి ఇంటికి వెళ్లి తిరిగి వస్తూ.. నాగావళి నదిలో స్నానానికి దిగి ప్రాణాలు కోల్పోయినట్ల తెలుస్తోంది.

ఇదీ చదవండి..

Raghurama letter to CM Jagan: 'సంపూర్ణ మద్యపాన నిషేధానికి కట్టుబడి ఉండాలి'

ABOUT THE AUTHOR

...view details