ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరద ప్రవాహంలో యువకుడు గల్లంతు - vizainagram latest updates

వరద నీటిలో ఓ యువకుడు గల్లంతైన ఘటన విజయనగరం జిల్లా కొత్తవలసలో జరిగింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు.

వరద ప్రవాహంలో యువకుడు గల్లంతు
వరద ప్రవాహంలో యువకుడు గల్లంతు

By

Published : Oct 27, 2020, 3:09 PM IST

వరద ప్రవాహంలో యువకుడు గల్లంతు

విజయనగరం జిల్లా సీతానగరం మండలం కొత్తవలస డ్యాం వద్ద వరద నీటిలో శివ అనే యువకుడు గల్లంతయ్యాడు. పార్వతీపురం మండలానికి చెందిన శివ ద్విచక్ర వాహనాన్ని నడిపిస్తూ నదిని దాటే ప్రయత్నం చేశాడు.

వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో నీటిలో కొట్టుకుపోయాడు. అతనితో పాటు వెళ్లిన స్నేహితుడు ఇచ్చిన సమాచారం మేరకు కుటుంబీకులు, పోలీసులు ఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి:

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details